Telugu Gateway
Andhra Pradesh

‘పవన్’ జెఎఫ్ సీలో చీలికలు

‘పవన్’ జెఎఫ్ సీలో చీలికలు
X

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ (జెఎఫ్ సీ)లో చీలికలు వచ్చాయి. ఈ కమిటీ నుంచి మాజీ ఐఏఎస్ అధికారి జయప్రకాష్ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. జెఎఫ్ సీ నివేదిక అందిన తర్వాత పవన్ దీనిపై పెద్దగా దృష్టి పెట్టడంలేదన్నారు. ‘జేఎఫ్‌సీపై పవన్ మొదట్లో చూపించినంత శ్రద్ధ ఇప్పుడు కనబరటం లేదు. అధ్యయనం, చర్చల చేసి లెక్కలు తీస్తే.. దానిపై ఎలాంటి పురోగతి కనిపించటం లేదు. పవన్‌ కూడా ఎందుకనో ఆసక్తికనబరచటం లేదు. అందుకే కొత్తగా స్వతంత్ర నిపుణుల కమిటీని ఏర్పాటు చేశాం.

జేఎఫ్‌సీ మొదటి దశ అయితే ఇది రెండో దశ. కేంద్రం సమయం కేటాయిస్తే వెళ్లి కలిసి చర్చిస్తాం’ అని జేపీ పేర్కొన్నారు. ఉంటే ప్రత్యేక హోదా అసలు తెర పైకి తెచ్చిందే తానని జేపీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈ జెఎఫ్ సీలో ఉండవల్లి అరుణకుమార్, పద్మనాభయ్య, ఇతర పార్టీల నేతలతో కూడా మాట్లాడారు. ఈ కమిటీ అటు కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల తీరును తప్పుపట్టింది. అయితే చంద్రబాబు మాత్ర అసెంబ్లీలో నా మీద జెఎఫ్ సీ వేయటానికి మీరు ఎవరు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story
Share it