నిఖిల్ కొత్త సినిమా ముహుర్తం ఖరారు
BY Telugu Gateway2 March 2018 6:03 PM IST
X
Telugu Gateway2 March 2018 6:03 PM IST
వెరైటీ కథలతో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకుంటున్నాడు యువ హీరో నిఖిల్. ఇప్పుడు ఈ యువ హీరో కొత్త కిరాక్ పార్టీ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమా మార్చి 16న విడుదల కానుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. కన్నడ సినిమా కిరిక్ పార్టీకి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈసినిమా నిఖిల్‌కు మరో హిట్ ఇస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. కిర్రాక్ పార్టీ సినిమాతో శరన్ కొప్పిశెట్టి దర్శకునిగా పరిచయమవుతున్నారు. నిఖిల్ తో ‘స్వామి రా రా’, ‘కార్తికేయ’ వంటి హిట్ చిత్రాలు తీసిన దర్శకులు సుధీర్ వర్మ, చందూ మొండేటి ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే, మాటలు అందించారు. సంయుక్త హెగ్డే, సిమ్రాన్ పరీన్జ నిఖిల్ సరసన హీరోయిన్ లు గా నటించారు.
Next Story