Telugu Gateway
Cinema

‘బొంగులో లైఫ్’...!

‘బొంగులో లైఫ్’...!
X

ఏంటి బూతులు..రాస్తున్నారు అంటారా?. అదేమీ కాదండి బాబూ. ఓ హీరో లైఫ్ పై చెప్పిన మాటలు ఇవి. అవి ఎక్కడ అంటారా?. ‘నీది నాదీ ఒకే కథ’ పేరుతో వస్తున్న సినిమాకు సంబంధించిన ట్రైలర్ లో హీరో శ్రీ విష్ణు చెప్పిన డైలాగ్ అది. ‘ఎప్పుడు చస్తామో తెలీని ఈ బొంగులో లైఫ్‌లో ఏంట్రా మీ సోదంతా’ అంటూ చెప్పే డైలాగ్ చాలా సీరియస్ గా ఉంటుంది. శ్రీ విష్ణు వినూత్నమైన కథలతో ఓ వైపు హీరోగా చేస్తూనే...హీరో ఫ్రెండ్ పాత్రల్లోనూ నటిస్తున్నాడు.విజయానికి ఐదు మెట్లు...విజయానికి ఆరు మెట్లు..విజేతలోనే విజయం అంటూ శ్రీవిష్ణు చెప్పే డైలాగ్ లు ఆసక్తికరంగా ఉన్నాయి.

తాజాగా శ్రీవిష్ణు నటించిన నీది నాది ఒకే కథ చిత్ర ట్రైలర్‌ విడుదలైంది. చదువుల్లో పూర్‌ అయిన కుర్రోడు .. టీచర్‌ అయిన తన తండ్రి మెప్పుపొందేందుకు చేసే ప్రయత్నమే నీది నాది ఒకే కథ. హీరోయిన్‌ సట్నా టైటస్‌(బిచ్చగాడు ఫేం) మధ్య నడిచే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉన్నాయి. మార్చి 23న నీది నాది ఒకే కథ ప్రేక్షకుల ముందుకు రానుంది.

https://www.youtube.com/watch?v=Aes4Uqiz3gA

Next Story
Share it