Telugu Gateway
Cinema

నానితో త్రివిక్రమ్ సినిమా!

నానితో త్రివిక్రమ్ సినిమా!
X

ప్రస్తుతం టాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్న వార్త ఇది. జూనియర్ ఎన్టీఆర్ తో చేయనున్న సినిమా పూర్తి అయిన తర్వాత త్రివిక్రమ్ నానితో సినిమా చేయటానికి రెడీ అయిపోయినట్లు సమాచారం. త్వరలోనే ఎన్టీఆర్ తో సినిమా పట్టాలు ఎక్కనుంది. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన పనుల్లోనే బిజీగా ఉన్నారు ఈ మాటల మాంత్రికుడు. త్రివిక్రమ్ తాజా సినిమా ‘అజ్ణాతవాసి‘ బాక్సాఫీస్ వద్ద భారీ నిరాశను మిగిల్చింది. దీంతో ఎన్టీఆర్ సినిమాపై భారీ ఆశలే పెట్టుకున్నాడు.

అయితే ఎన్టీఆర్ కూడా ఈ మధ్య కాలంలో వరస పెట్టి హిట్లు కొడుతూ ముందుకు సాగుతున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్, ఎన్టీఆర్ సినిమా అంటే సహజంగానే అంచనాలు భారీగా ఉంటాయి. గతంలో జరిగిన ప్రచారానికి భిన్నంగా టాప్ హీరోలను పక్కన పెట్టేసి టాలీవుడ్ లో వరస హిట్లతో దూసుకెళుతున్న నానితో జతకట్టనున్నట్లు టాక్. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది.

Next Story
Share it