‘ఆడోళ్లు భలే కఠినాత్ములు’ అంటున్న నాని
నాని అదరగొడుతున్నాడు. ఎక్కడ అంటున్నారా?. కృష్ణార్జున యుద్ధం సినిమా టీజర్ లో. అందులో నాని అమ్మాయిలకు కోపం వచ్చే డైలాగ్ ఒకటి చెప్పాడు. అదేంటి అంటే..‘ఆడోళ్ళు భలే కఠినాత్ములు’ అని అంటున్నాడు. దీని వెనక కారణం ఏమై ఉంటుందో? అంటారా? ఓ సారి ఈ టీజర్ చూడండి. ఓకింత క్లారిటీ వస్తుంది. అంతే కాదు..అమ్మాయిలను తాను లవ్ లో ఎలా పడేస్తానో..పడేయాలో ఓ సందేశం కూడా ఇచ్చాడు. ‘అవతలి వారిని మనం ఎంత కోరుకంటున్నామో అది స్పష్టంగా మన కళ్ళలో కనపడాలి’. అని చెబుతున్నాడు. టాలీవుడ్ లో వరస పెట్టి హిట్లు కొడుతున్న నాని కొత్త చిత్రమే ఈ కృష్ణార్జున యుద్దం.
ఈ సినిమాలో నాని ద్విపాత్రాభినయం చేస్తుండటం విశేషం. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఒక పాత్రలో మాస్ కుర్రాడిగా కనిపిస్తే మరో పాత్రలో ఫారిన్ లో ఉండే రాక్ స్టార్‌ల కనిపిస్తున్నాడు. అనుపమా పరమేశ్వరన్, రుక్సర్ మీర్ లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు హిప్ హాప్ తమిళ సంగీతమందిస్తున్నాడు. ఏప్రిల్ 12న రిలీజ్‌కు చేయనున్నారు. రామాయణం అంతా విని ధర్మరాజు ఎవరు అని అడిగింది అంట నీ లాంటి సోంబేరు మొహంది అని నాని డైలాగు చెపితే...రామాయణంలో ధర్మరాజు ఏడ ఉన్నాడురా? అంటే నాని లాగిపెట్టి ఒకటి కొడితే...ఇంత గట్టిగా కొట్టాక రామాయణంలో రెబల్ స్టార్ కృష్ణంరాజు, ఎడిటర్ గౌతంరాజు కూడా ఉంటారు అంటాడు. ఈ డైలాగ్ లు ప్రేక్షకులను నవ్వించేలా ఉన్నాయి.
https://www.youtube.com/watch?v=pdfyHCkKa_8