Telugu Gateway
Telangana

గురితప్పిన మోత్కుపల్లి బాణం!

గురితప్పిన మోత్కుపల్లి బాణం!
X

తెలంగాణ తెలుగుదేశం సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు ఎవరి కోసం పనిచేస్తున్నారు?. ఆయన ఏజెండా ఏమిటి?. ఇదీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ లో రెండు రోజుల పాటు జరిగిన పార్టీ సమావేశానికి హాజరుకాని ఆయన తనను పిలవకుండా సమావేశం పెడతారా? అంటూ ఆగ్రహించారు. అంత వరకూ ఓకే. కానీ తెలంగాణలో టీడీపీ దుస్థితికి కారణం రేవంత్ రెడ్డి అని చెప్పటం ద్వారా దీని వెనక కారణాలేంటో ఊహించుకోవవటం పెద్ద కష్టం కాకపోవచ్చు. నిజంగా తెలంగాణలో ఓ ఎమ్మెల్సీ గెలిస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారా?. ఈ గెలుపుతో ఆయనకు వచ్చే ప్రయోజనం ఏముంటుంది?. అందులో అసలు టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రమేమయే లేదా?. చంద్రబాబుకు సంబంధం లేకుండానే రేవంత్ రెడ్డి కారులో వెళ్లి స్టీఫెన్ సన్ కు డబ్బులు ఇఛ్చి వచ్చారా?. అసలు ఈ స్కెచ్ వేసింది ఎవరు? ఈ విషయాలు అన్నీ పార్టీలో సీనియర్ నేతగా ఉన్న మోత్కుపల్లికి తెలియవా?. ఎప్పుడో పార్టీని వీడిపోయినా రేవంత్ రెడ్డిని ఇప్పుడు టార్గెట్ చేయటం ద్వారా ఎవరిని సంతృప్తిపర్చాలని అనుకుంటున్నారు? అన్నది బహిరంగ రహస్యమే. ఓటుకు నోటు కేసు బహిర్గతం అయిన వెంటనే రేవంత్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు అయితే టీడీపీకి ప్రస్తుతం తెలంగాణలో ఈ పరిస్థితి ఉండేదికాదని మోత్కుపల్లి వ్యాఖ్యానించారు.

కొద్ది రోజుల క్రితం టీ టీడీపీని టీఆర్ఎస్ లో వీలీనం చేయాలని వ్యాఖ్యానించి పెద్ద దుమారమే రేపారు. ఇప్పుడు కూడా మరోసారి ఎన్టీఆర్ ఆశీస్సులు పొందిన వారు చాలా మంది టీఆర్ఎస్ లో ఉన్నారని...టీడీపీ ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటేనే బాగుంటుందని వ్యాఖ్యానించారు. అదే సమయంలో తెలంగాణలో టీడీపీకి నాయకత్వంలేదని..చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగితే తప్ప..పార్టీ గాడినపడటం కష్టం అని వ్యాఖ్యానించారు. అయితే అధినేత నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ప్రకటించారు. తెలంగాణ తెలుగుదేశం నేతలు కూడా ఉద్దేశపూర్వకంగానే మోత్కుపల్లిని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో జరిగిన సమావేశానికి..చంద్రబాబు నివాసంలో జరిగిన మీటింగ్ కు పిలవలేదని చెబుతున్నారు. మోత్కుపల్లి త్వరలోనే పార్టీని వీడుతారని ప్రచారం జరుగుతోంది.

Next Story
Share it