‘పంచె కట్టె’లో అదరగొట్టిన మహేష్ బాబు
BY Telugu Gateway18 March 2018 9:35 AM GMT

X
Telugu Gateway18 March 2018 9:35 AM GMT
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పంచె కట్టులో అదరగొట్టాడు. ఉగాది సందర్భంగా అచ్చమైన తెలుగుదనం ఉట్టిపడేలా ‘భరత్ అనే నేను’ సినిమాకు సంబంధించిన లుక్ ను విడుదల చేశారు. ఈ లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో మహేష్ బాబు ముఖ్యమంత్రిగా చేస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో తెరెకెక్కుతున్న ఈ సినిమాపై మహేష్ బాబు అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
గత సినిమాలు బ్రహ్మోత్సవం, స్పైడర్ లు పూర్తిగా నిరాశపర్చిన సంగతి తెలిసిందే. కొరటాల శివ, మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన ‘శ్రీమంతుడు’ సినిమా సూపర్ హిట్ కావటంతో ఈ సినిమాపై కూడా అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. ఏప్రిల్ 20న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాలో మహేష్ బాబుకు జోడీగా బాలీవుడ్ భామ కైరా అద్వానీ నటిస్తోంది.
Next Story
కెసీఆర్ పెద్ద పరీక్షే పెట్టుకున్నారు..అందులో విజయం సాధ్యమా?!
2 July 2022 12:50 PM GMTస్పైస్ జెట్ విమానంలో పొగ..ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరి
2 July 2022 5:36 AM GMTఆవో-దేఖో-సీకో
1 July 2022 3:17 PM GMTనుపుర్ శర్మపై సుప్రీం ఫైర్
1 July 2022 6:58 AM GMTఏపీలో సర్కారు వారి 'సినిమా ఆగింది'
1 July 2022 6:24 AM GMT
ప్రేమలేఖలు అందాయన్న శరద్ పవార్
1 July 2022 6:05 AM GMTఫడ్నవీస్ కు అధిష్టానం షాక్..డిప్యూటీ సీఎం పదవి
30 Jun 2022 2:04 PM GMTవ్యూహాం మార్చిన బిజెపి..శివసేనను పూర్తిగా ఖతం చేసేందుకేనా!
30 Jun 2022 12:27 PM GMTముంబయ్ చేరుకున్న ఏక్ నాథ్ షిండే
30 Jun 2022 9:42 AM GMTసంజయ్ రౌత్ కు ఈడీ నోటీసులు
27 Jun 2022 12:15 PM GMT