Telugu Gateway

‘మోడీ’పై మోహన్ బాబు...కొరటాల ఫైర్

‘మోడీ’పై మోహన్ బాబు...కొరటాల ఫైర్
X

ప్రత్యేక హోదా విషయంలో సినీ ప్రముఖులు కూడా స్పందించటం ప్రారంభించారు. ప్రధాని నరేంద్రమోడీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏపీ ఏమి చేసింది. ఎందుకు రాష్ట్రంపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని ప్రముఖ నటుడు మోహన్ బాబు ప్రశ్నించారు. తెలంగాణ కూడా ఏపీ హోదాకు మద్దతు పలుకుతుంది కదా? అని ప్రశ్నించారు. టాలీవుడ్ కు చెందిన ప్రముఖ దర్శకుడు కొరటాల శివ ఒకింత ఘాటుగా స్పందించారు. కొరటాల ఇప్పుడు రాజకీయ నేపథ్యంలో మహేష్ బాబు హీరోగా ‘భరత్ అను నేను’ సినిమా తెరకెక్కిస్తున్నారు.

ఈ మధ్యే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ లో ఓ కీలక వ్యాఖ్య చేస్తాడు మహేష్ బాబు. అదేంటి అంటే ‘ఒకసారి మాట ఇచ్చి తప్పితే యుఆర్‌ నాట్‌ కాల్డ్‌ ఏ మ్యాన్‌’ అని వ్యాఖ్యానిస్తారు. అదే మాటను ప్రధాని నరేంద్రమోదీకీ అన్వయిస్తూ ‘నరేంద్ర మోదీ గారికి ఆంధ్ర ప్రదేశ్‌కు ఇచ్చిన హామీని గుర్తు చేసి ఆయన్ను మనిషిని చేయండి. సర్‌.. మీరు తెలుగు రాష్ట్రాలు భారతదేశంలోని భాగమే అని భావిస్తున్నారా..?’ అంటూ ట్వీట్ చేశాడు.

Next Story
Share it