Telugu Gateway
Telangana

కెసీఆర్...మళ్ళీ అదే లెక్క

కెసీఆర్...మళ్ళీ అదే లెక్క
X

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత, సీఎం కెసీఆర్ మరోసారి అవే లెక్కలు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు 106 సీట్లు వస్తాయని ప్రకటించారు. అదే సమయంలో ఓ నలుగురైదురికి మినహా ఎవరికీ టిక్కెట్లు మార్చబోమని హామీ ఇచ్చారు. సోమవారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాంపై టీఆర్ఎస్ ఎల్పీ జరిగింది. కొంత మంది ఎమ్మెల్యేల తీరుపై సీఎం కెసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తీరుమార్చుకోకుంటే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు.

వచ్చే ఎన్నికలపై ఆందోళన అక్కర్లేదని, అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా 106 సీట్లలో తమదే విజయమని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా మార్పు కోసమే థర్డ్ ఫ్రంట్ ఆలోచన చేశానన్న కేసీఆర్.. అసెంబ్లీలో అందరూ అప్రమత్తంగా ఉండాలంటూ పార్టీ నేతలకు సూచించారు. ‘అసెంబ్లీ సమావేశాల తర్వాత ఢిల్లీకి వెళ్తాను. అన్ని పార్టీల నేతలను కలుస్తా. ప్రత్యామ్నాయ రాజకీయ అవసరాలను, ప్రస్తుత రాజకీయ పరిస్థితులను నేతలకు వివరిస్తానని కేసీఆర్ తెలిపారు.

Next Story
Share it