కొత్త లుక్ లో ఎన్టీఆర్
కొత్త సినిమా. కొత్త లుక్. ఇదీ ఎన్టీఆర్ స్టైల్. సినిమా సినిమాకు కొత్తదనం చూపిస్తూ దూసుకెళుతున్న ఈ నందమూరి హీరో ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమా కోసం మరింత స్లిమ్ గా మారేందుకు ఎన్టీఆర్ కష్టపడుతున్నాడు. ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ దీనికి సంబంధించి చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇదే ట్రైనర్ బాలీవుడ్ హీరోలు హృతిక్ రోషన్, రణ్ వీర్ సింగ్ లకు శిక్షణ ఇస్తున్నారు. త్వరలోనే ఎన్టీఆర్ కొత్త సినిమా పట్టాలు ఎక్కనుంది. ఇది ఎన్టీఆర్ 28వ సినిమా.
తాజా సినిమా జైలవకుశలో ఎన్టీఆర్ తొలిసారి త్రిపాత్రాభినయంతో దుమ్మురేపిన విషయం తెలిసిందే. ముఖ్యంగా జై పాత్రలో ఎన్టీఆర్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. త్రివిక్రమ్ సినిమాలో ఎన్టీఆర్ కు జోడీగా శ్రద్దాకపూర్ నటించనున్నారు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ ఎస్ ఎస్ రాజమౌళి సినిమాలో నటించే అవకాశాలు మెండుగా ఉన్నాయని టాక్. ఇందులో మరో టాప్ హీరో రామ్ చరణ్ కూడా నటించనున్న సంగతి తెలిసిందే.