Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబు కార్యక్రమం కోసం తాళం వేసి

చంద్రబాబు కార్యక్రమం కోసం తాళం వేసి
X

విజయవాడలో వాళ్లంతా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి కార్యక్రమం కోసం వచ్చారు. అది ఆదరణ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమం. కానీ ఎంతకూ సీఎం రాకపోవటంతో ఈ కార్యక్రమం కాస్తా రసాభాసగా మారింది. ఉదయం నుండి ప్రాంగణంలోనే ఉన్న సభికులు. ముఖ్యమంత్రి రావడం ఆలస్యం అవడం తో ఎవరినీ బయటికి పంపని అధికారులు..ఏకంగా గేట్లకు తాళాలు వేశారు.

బయటికి వెళ్లడం కోసం గేట్ల వద్ద పడిగాపులు కాస్తున్న ప్రజలు. ప్రాంగణం లో మూత్రశాలలు లేక ఉదయం నుండి ఇబ్బందులు పడుతున్న మహిళలు.మధ్యాహ్నాం 3 గంటలకు వస్తారన్న ముఖ్యమంత్రి ఇప్పటికి రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న ప్రజలు. కానీ చివరగా సాయంత్రం ఎప్పుడో వచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం చంద్రబాబు.

Next Story
Share it