Telugu Gateway
Andhra Pradesh

హావ్వ...ఏ1..ఏ2ల వెంట ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబా!

హావ్వ...ఏ1..ఏ2ల వెంట ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబా!
X

మాట్లాడితే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ. దేశంలో సీనియర్ నేతను నేనే. అసెంబ్లీ సాక్షిగా ఇదే డబ్బా. బయటా ఇదే డబ్బా. ఇదీ టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి తీరు. కేంద్రం నో అనగానే..చంద్రబాబు నో అంటూ ప్రత్యేక హోదాను అటకెక్కించి ‘ప్యాకేజీ’ పాట పాడారు. తర్వాత ప్యాకేజీకి చట్టబద్దత ఆట ఆడారు. ప్యాకేజీ..చట్టబద్దత అన్నీ పోయాయి. సీన్ రివర్స్. ఎన్నికల వేళ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావటంతో మళ్లీ రివర్స్ గేర్. తిరిగి ప్రత్యేక హోదా బాట. ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి రాజకీయం కోసమా..రాష్ట్రం కోసమా? అన్నది పక్కన పెడితే ప్రత్యేక హోదాపై మొదటి నుంచి ఒకటే మాట. ఎంపీల రాజీనామాల విషయంలో ఆయనా మాట తప్పారు మొదట. మళ్ళీ ఇఫ్పుడు సమావేశాల చివరి రోజు ఎంపీల రాజీనామాలు చేస్తారని చెబుతున్నారు. చూడాలి. అయితే కేంద్రంపై పెట్టే అవిశ్వాసానికి జగన్ పలుమార్లు బహిరంగానే మద్దతు ఇవ్వాలని..తమతో కలసి రావాలని..లేదంటే టీడీపీ అవిశ్వాస తీర్మానం పెడితే తాము మద్దతు ఇస్తామని ప్రకటించారు.

దీనిపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోనే ఎంతో సీనియర్ నేతను అయిన తాను ఏ1, ఏ2లు చెపితే రాజకీయం నేర్చుకోవాలా?. మనం వాళ్ళను ఫాలో అవ్వాలి. ఎవరైనా ఆర్థిక నేరస్తుల వెంట నడుస్తారా? అంటూ మాట్లాడారు. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడుతో పాటు టీడీపీ నేతల అందరికీ అదే మాట. కానీ ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఝలక్ తో చంద్రబాబుకు మైండ్ బ్లాంక్ అయినంత పని అయింది. ఇప్పుడు వైసీపీ లోక్ సభలో పెట్టే అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించారు. మరి ఏ1, ఏ2ల వెంట చంద్రబాబు ఎలా వెడతారు?. ఆయన అనుభవం ఎక్కడికి పోయింది. నాలుగైదు రోజుల వరకూ జగన్ ప్లాన్ రాజకీయం అయినప్పుడు..ఇప్పుడు మారిందా?. మారింది చంద్రబాబు వైఖరే కానీ..వేరే ఎవరిదీ కాదు కదా. హావ్వ..చంద్రబాబు పరువు ఏమైపోను?.

Next Story
Share it