నేరస్తులను కలిసే మోడీతో కలిసెందుకున్నారు బాబూ!

ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్ మెంట్లను తెలుగుదేశం పార్టీ ఖరారు చేస్తుందా?. ఎవరిని కలవాలో ప్రధాని మోడీ సొంతంగా నిర్ణయం తీసుకోకూడదా?. ఏమో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాటలు చూస్తుంటే అలాగే ఉంది వ్యవహారం. ఓ వైపు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆర్థిక నేరస్థులు ఎక్కడైనా ప్రధానిని కలవటం ఉందా? అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తప్పు అపాయింట్ మెంట్ ఇస్తున్న మోడీదా? లేక కలిసే వాళ్ళదా?. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అయితే మరింత ముందుకెళ్ళి ఆర్థిక నేరగాళ్లకు ప్రధాని మోడీ అపాయింట్ మెంట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. అంతే కాదు.. జగన్ కు అపాయింట్ మెంట్ ఇచ్చినట్లే నీరవ్ మోడీకి ఇస్తారా? అని ప్రశ్నించారు. మోడీ అపాయింట్ మెంట్లను నియంత్రించేందుకు తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుంచో కష్టపడుతోంది...కానీ పని మాత్రం కావటం లేదు పాపం. మరి ఇంత బహిరంగంగా ఆర్థిక నేరస్తులను కలిసే ప్రధాని నరేంద్రమోడీతో ఇంకా తెలుగుదేశం పార్టీ ఎందుకు కలసి ఉన్నట్లో. మీరు ఆర్థిక నేరస్థులను కలుస్తున్నారు మేం మీతో ఉండలేం అని చెప్పొచ్చు కదా?. తెలుగుదేశం పార్టీ ఇంకా ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న విషయం తెలిసిందే.
నీరవ్ మోడీ అంత రేంజ్ లో కాకపోయినా సాక్ష్యాత్తూ నిన్నమొన్నటి వరకూ కేంద్ర మంత్రిగా ఉన్న సుజనా చౌదరి కంపెనీలపై కూడా బ్యాంకులను మోసం చేసిన కేసులు ఉన్నాయి. సాక్ష్యాత్తూ ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా బ్యాంకులను మోసం చేసిన కేసులు ఉన్నాయి. ఓ టీడీపీ ఎమ్మెల్సీ వందల కోట్ల రూపాయల మేర బ్యాంకులను బురిడీ కొట్టించి ఏకంగా సీబీఐ కేసును ఎదుర్కొంటున్నారు. ఈ కేసు వచ్చాక ఎమ్మెల్సీని టీడీపీ నుంచి సస్పెండ్ చేశారనుకోండి. నిజంగా చంద్రబాబుకు చిత్తశుద్ధి..నిజాయతీగా వ్యవహరించాలనే ఆలోచన ఉంటే బిజెపికి రాం రాం చెప్పి...ఆర్థిక నేరస్తుల అపాయింట్ మెంట్లు అయినా..ఇంకా ఏదైనా ప్రశ్నిస్తే ఒకింత గౌరవంగా ఉంటుందేమో. మరి చంద్రబాబు మిత్రుడిగా ఉండి మోడీ ఇలా ఆర్థిక నేరస్తులను కలుస్తుంటే ఆ ప్రభావం చంద్రబాబుపై..తెలుగుదేశంపై పడదా?.
మునుగోడు ఉప ఎన్నిక..టీఆర్ఎస్ అనుకుంటే వస్తది..లేదంటే లేదు!
2 Aug 2022 2:38 PM GMTఎలన్ మస్క్ ప్రైవేట్ ఎయిర్ పోర్టు!
2 Aug 2022 12:41 PM GMTఏటీఎంలో 'స్ట్రక్ అయిన బిజెపి అగ్రనేతలు!'
2 Aug 2022 12:04 PM GMT'మ్యూట్' లో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్!
2 Aug 2022 6:45 AM GMTదిల్ రాజు 'డబుల్ గేమ్' దుమారం!
1 Aug 2022 3:16 PM GMT
మునుగోడు ఉప ఎన్నిక..టీఆర్ఎస్ అనుకుంటే వస్తది..లేదంటే లేదు!
2 Aug 2022 2:38 PM GMTఏటీఎంలో 'స్ట్రక్ అయిన బిజెపి అగ్రనేతలు!'
2 Aug 2022 12:04 PM GMTజగన్ ..మీరు తోడుదొంగలు..సోము వీర్రాజుకు అమరావతి రైతుల షాక్!
29 July 2022 7:53 AM GMTగజ్వేల్ అయినా రెడీ..హుజూరాబాద్ అయినా ఓకే
26 July 2022 2:57 PM GMTమునుగోడు బలం బిజెపిదా..రాజగోపాల్ రెడ్డిదా?!
26 July 2022 10:58 AM GMT