Telugu Gateway
Andhra Pradesh

ఎట్టకేలకు హీరో మోటోకార్ప్ కు శంకుస్థాపన

ఎట్టకేలకు హీరో మోటోకార్ప్ కు శంకుస్థాపన
X

రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు వచ్చిన తొలి ఆటోమొబైల్ కంపెనీ హీరో మోటోకార్ప్. కానీ భూ వివాదాలు..పారిశ్రామిక రాయితీలు తదితర అంశాల కారణంగా ఇప్పటివరకూ కనీసం శంకుస్థాపనకు కూడా నోచుకోలేదు. ఎట్టకేలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శుక్రవారం నాడు హీరో మోటో కార్ప్ యూనిట్ కు శంకుస్థాపన చేశారు. ఏపీ ఆటోమొబైల్ రంగంలో ఇది కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. చిత్తూరు జిల్లాలోని సత్యవేడు మండలం మాదనపాళెం గ్రామం వద్ద హీరో మోటో ఆటోమొబైల్ యూనిట్ రానుంది. ఈ సంస్థ నూతన యూనిట్ పై తొలి దశలో 1600 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుంది.

600 ఎకరాల్లో ఈ పరిశ్రమ రానుంది. అనుబంధ సంస్థలు కూడా ఇదే ప్రాంతంలో మరో 1600 కోట్ల రూపాయల పరిశ్రమలు రానున్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ యూనిట్ ద్వారా ప్రత్యక్షంగా..పరోక్షంగా 15 వేల మంది ఉద్యోగావకాశాలు వస్తాయని అంచనా. హీరో మోటో కార్ప్ సాధ్యమైనంత త్వరగా తొలి దశ యూనిట్ ను ప్రారంభించాలని సీఎం చంద్రబాబునాయుడు ఈ సందర్బంగా సంస్థ యాజమాన్యాన్ని కోరారు. ప్రభుత్వపరంగా అన్ని రకాల సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. విద్యుత్, నీటి సరఫరాలో కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు.

Next Story
Share it