Telugu Gateway
Andhra Pradesh

అమరావతిపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

అమరావతిపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
X

ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. రాజధాని నిర్మాణం కోసం కేంద్రం ఇచ్చిన 1500 కోట్ల రూపాయలను వేరే చోట ఖర్చు పెట్టిన చంద్రబాబు సర్కారు...ఇప్పుడు రాజధాని కోసం ప్రత్యేక బాండ్లు జారీ చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఈ బాండ్లకు బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీ రేటు ఇస్తామని..అదే సమయంలో వీటికి ప్రభుత్వ గ్యారెంటీ ఉంటుందని ప్రకటించారు. వినూత్నమార్గంలో ఈ నిధుల సమీకరణ చేస్తామని తెలిపారు. కేంద్రంతో ఘర్షణ వాతావరణం తలెత్తిన ఈ తరుణంలో చంద్రబాబు తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మొదటి నుంచి సింగపూర్ సంస్థలు రాజధాని నిర్మిస్తాయని ప్రకటించిన చంద్రబాబు ప్రస్తుతం ఈ అంశాన్ని పూర్తిగా వదిలేశారు. నాలుగేళ్ళు కావస్తున్నా ఇంత వరకూ అత్యంత కీలకమైన అసెంబ్లీ,సచివాలయం, హైకోర్టులకు సంబంధించిన తుది డిజైన్లు సర్కారు చేతికి అందలేదు.

ఈ తరుణంలో కేంద్రంతో ఘర్షణ రాజధానిపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో అన్న టెన్షన్ ఏపీ ప్రజల్లో నెలకొంది. బీజేపీతో పొత్తు పెట్టుకోకుంటే తామకు 2014 ఇంకో 15 సీట్లు ఎక్కవ వచ్చేవని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. బీజేపీతో తమ పొత్తు గురించి చంద్రబాబు మాట్లాడుతూ పొత్తు పెట్టుకున్న పార్టీకి అన్యాయం చేస్తారా అని బీజేపీ నేతలను నిలదీశారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయం పట్ల తాము కచ్చితంగా ఢిల్లీ వెళ్తామని ఆయన అన్నారు. ఏపీకి కేంద్రంలోని బీజేపీ చేసిన అన్యాయంపై అందరినీ ఏకం చేసి పోరాడతామని అన్నారు. లోక్ సభలో అవిశ్వాసం వ్యవహారం షరామామూలుగానే తయారైంది. బుధవారం నాడు కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. మళ్ళీ ఏప్రిల్ 2న కానీ ఈ అంశం చర్చకు వచ్చే అవకాశం లేదు. అప్పుడైనా సభలో అవిశ్వాసంపై చర్చ టేకప్ చేస్తారా అంటే అదీ గ్యారంటీ లేదు.

Next Story
Share it