అహ్మద్ బాబుపై సీఎస్ సీరియస్!

నెలకు మూడు కోట్ల ఫోన్లు. నాలుగు కోట్ల బిల్లు. నమ్ముతున్నారా?. నమ్మాలి మరి. ఎందుకంటే రియల్ టైమ్ గవర్నెన్స్ పేరుతో తాము ఇవన్నీ చేస్తున్నామని ఆర్టీజీఎస్ సీఈవో అహ్మద్ బాబు చెబుతున్నారు మరి. ఈ లెక్కలు చూసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ ఈ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అన్నీ బోగస్ లెక్కలు చెబుతూ ..పచ్చి మోసం చేస్తూ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నట్లు సీఎస్ మండిపడ్డారు. అసలు ఆర్టీజీఎస్ లో నెలకు మూడు కోట్ల ఫోన్లు చేస్తున్నారనే విషయం నిర్ధారించే వ్యవస్థ కూడా ఏమీ ఉండదని చెబుతున్నారు. కానీ ఈ పేరుతో మాత్రం కోట్లాది రూపాయలు వ్యయం చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే ఆసియాలోనే అతిపెద్ద రియల్ టైమ్ గవర్నెన్స్ కు సంబంధించిన కంట్రోల్ రూమ్ ను వెలగపూడి తాత్కాలిక సచివాలయంలో ప్రారంభించారు.
ఇక్కడి ప్రధాన కమాండ్ కంట్రోల్ రూమ్ తో 13 జిల్లాల్లోని కేంద్రాలతో అనుసంధానం చేశారు. వివిధ ప్రభుత్వ పథకాలు ప్రజలకు ఎలా అందుతున్నాయో తెలుసుకునేందుకు వీలుగా 1100 కాల్ సెంటర్లు కూడా ఏర్పాటు చేశారు. అంతకు ముందు చంద్రబాబు కృష్ణా నది పక్కనే కోట్లాది రూపాయల వెచ్చించి కమాండ్ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేయించారు. వాస్తుతో పాటు రకరకాల కారణాలు చెప్పి దాన్ని ఇప్పుడు పూర్తిగా గాలికి వదిలేశారు. కొత్త రాష్ట్రం నిధుల సమస్య అని నిత్యం వాపోయే చంద్రబాబు మాత్రం హైటెక్ హంగుల కోసం..అస్మదీయ కంపెనీలకు మేలు చేయటం కోసం సర్కారు సొమ్మును మంచినీళ్ళలా ఖర్చుపెడుతున్నారని ప్రభుత్వ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
జగన్ కుంభకోణాల టీజర్ వదిలిన నారా లోకేష్
27 May 2022 3:23 PM GMTఅసెంబ్లీ రద్దుకు మేం రెడీ..పార్లమెంట్ రద్దుకు మీరు రెడీనా?
27 May 2022 2:15 PM GMTటాలీవుడ్ కు టిక్కెట్ రేట్ల షాక్
27 May 2022 10:30 AM GMTరాష్ట్రం పరువు తీస్తున్న జగన్
27 May 2022 9:33 AM GMTడ్రగ్స్ కేసులో షారుఖ్ కొడుకు ఆర్యన్ ఖాన్ కు క్లీన్ చిట్
27 May 2022 8:23 AM GMT
జగన్ కుంభకోణాల టీజర్ వదిలిన నారా లోకేష్
27 May 2022 3:23 PM GMTకాంగ్రెస్ అంటేనే అన్ని కులాల కలయిక
26 May 2022 7:15 AM GMTమోడీ తెలంగాణ టూర్..టీఆర్ఎస్ వర్సెస్ బిజెపి
26 May 2022 6:55 AM GMTఇక పార్టీ తోకలు తగిలించుకోదలచుకోలేదు
26 May 2022 5:22 AM GMTమీ వైఫల్యాలను మాపై రుద్దకండి
24 May 2022 2:00 PM GMT