Telugu Gateway
Cinema

‘అనుష్క’ అభిమానులకు శుభవార్త

‘అనుష్క’ అభిమానులకు శుభవార్త
X

బాహుబలి..భాగమతి సినిమాలు సూపర్ సక్సెస్ అయినా కూడా స్వీటి అనుష్క ఇఫ్పటివరకూ కొత్త సినిమా ఏదీ ఓకే చేయలేదు. దీంతో అనుష్క అభిమానులు అందరూ ఈ భామ కొత్త సినిమా ఎప్పుడెప్పుడా అని ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. కొత్త సినిమాలకు అంగీకరించకపోవటంతో పెళ్లి చేసుకోవటానికి రెడీ అయిపోతుందా? అనే సందేహలు కూడా వెల్లువెత్తాయి. అయితే అనుష్క ఓ కొత్త సినిమా చేయటానికి రెడీ అయిపోయంది.

అదీ గౌతమ్ మీనన్ దర్శకత్వంలో. అయితే ఇది కూడా హీరోయిన్ ఒరియంటెడ్ సినిమా అని చెబుతున్నారు. ఈ సినిమా జూన్ లో ప్రారంభం అయ్యే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం గౌతమ్‌మీనన్‌ విక్రమ్‌ హీరోగా ధ్రువనక్షత్రం, ధనుష్‌ హీరోగా ఎన్నై నోక్కి పాయుమ్‌ తూట్టా చిత్రాలను తెరకెక్కించే పనిలో ఉన్నారు. అయతే అనుష్క కొత్త సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.

Next Story
Share it