చంద్రబాబు అసలు గుట్టువిప్పిన ‘ఆంధ్రజ్యోతి’

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బిజెపితో నాలుగేళ్ళు కలిసుండి ఒక్కసారిగా ఆ పార్టీపై అంతగా కసి పెంచుకోవటానికి కారణం ఏంటి?. ఆయన చెబుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ పై ప్రేమ...రాష్ట్ర ప్రజలపై మమకారం అనుకుంటున్నారా?. అవేమీ కాదట. ఈ విషయాన్ని ఆంధ్రజ్యోతి పత్రికే బహిర్గతం చేసింది. ఇటీవల వరకూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో బిజెపి, టీడీపీలు భాగస్వాములుగా ఉన్న విషయం తెలిసిందే. ప్రత్యేక హోదాను పక్కన పెట్టి మోడీ సర్కారు ఇఛ్చిన ‘ప్రత్యేక ప్యాకేజ్’కి తలఊపేసిన చంద్రబాబు అండ్ కో ..ఏకంగా వెంకయ్యనాయుడికి ఏపీలో సన్మానాలు కూడా చేసేశారు. కానీ సడన్ గా ప్లేటు ఫిరాయించేశారు. దీనికి అసలు కారణం ఏంటో ఆంధ్రజ్యోతి పత్రిక బహిర్గతం చేసింది. అదేంటో మీరూ చూడండి. వచ్చే ఎన్నికల్లో బిజెపి తమకు పది ఎంపీ సీట్లు..50 అసెంబ్లీ సీట్లు కోరిందట. కోరటమే కాదు ఒత్తిడి కూడా చేసింది. చంద్రబాబు ఈ ప్రతిపాదనను నిర్ద్వందంగా తిరస్కరించారని చెబుతున్నారు. దీంతో చంద్రబాబును బిజెపి పెద్దలు పట్టించుకోవటం మానేశారు.
ఆ తర్వాత బడ్జెట్ లో కూడా ఏపీకి ఏమీ లేకపోవటంతో రాష్ట్రానికి ఇస్తామన్న ప్యాకేజీపై ఒత్తిడి తెచ్చారు.’ ఇదీ సారాంశం. అంటే బిజెపి ఎక్కువ సీట్లు అడిగిందని బయటకు వచ్చారే తప్ప..రాష్ట్ర ప్రయోజనాలు..ప్రత్యేక హోదా కోసం కాదనే విషయం దీని ద్వారా తేలిపోయింది. అయితే ఆ విషయం ఎక్కడా బయటపడకుండా..అసలు ప్రత్యేక హోదా చాంపియన్ ను తానే అన్న కలరింగ్ ఇచ్చుకునే పనిలో చంద్రబాబు నిమగ్నమై ఉన్నారు. ఈ దశలో ఆంధ్రజ్యోతి పత్రిక బహిర్గతం చేసిన అసలు విషయం తెలుగుదేశం పార్టీకి చిక్కులు తేవటం ఖాయంగా కన్పిస్తోంది. ఇది విపక్షాలకు కూడా ఓ అస్త్రంగా కూడా మారబోతోంది. ఓ వైపు బిజెపి కూడా కేంద్రం ఇచ్చిన నిధులను చంద్రబాబు సర్కారు ఏ మాత్రం సద్వినియోగం చేయటం లేదని ఆరోపిస్తోంది.
ఎన్టీఆర్ కు 'టీఆర్ఎస్ రాజకీయ నివాళులు'
28 May 2022 4:54 AM GMTజగన్ కుంభకోణాల టీజర్ వదిలిన నారా లోకేష్
27 May 2022 3:23 PM GMTఅసెంబ్లీ రద్దుకు మేం రెడీ..పార్లమెంట్ రద్దుకు మీరు రెడీనా?
27 May 2022 2:15 PM GMTటాలీవుడ్ కు టిక్కెట్ రేట్ల షాక్
27 May 2022 10:30 AM GMTరాష్ట్రం పరువు తీస్తున్న జగన్
27 May 2022 9:33 AM GMT
జగన్ కుంభకోణాల టీజర్ వదిలిన నారా లోకేష్
27 May 2022 3:23 PM GMTకాంగ్రెస్ అంటేనే అన్ని కులాల కలయిక
26 May 2022 7:15 AM GMTమోడీ తెలంగాణ టూర్..టీఆర్ఎస్ వర్సెస్ బిజెపి
26 May 2022 6:55 AM GMTఇక పార్టీ తోకలు తగిలించుకోదలచుకోలేదు
26 May 2022 5:22 AM GMTమీ వైఫల్యాలను మాపై రుద్దకండి
24 May 2022 2:00 PM GMT