Telugu Gateway
Offbeat

ప్రపంచంలో ఎత్తైన హోటల్ ఇదే

ప్రపంచంలో ఎత్తైన హోటల్ ఇదే
X

ప్రపంచంలో ఎత్తైనది ఏదైనా అక్కడే. భవనం అయినా...హోటల్ అయినా?. అది ఎక్కడో తెలుసా?. దుబాయ్ లో. కొత్తగా ఈ హోటల్ ను ప్రారంభించారు. ఇప్పటివరకూ ఈ రికార్డు దుబాయ్ పేరు మీదే ఉంది. తన రికార్డును దుబాయ్ తానే తిరగ రాసుకుంది. 356 మీటర్ల ఎత్తైన జీవోరో హోటల్ ప్రపంచంలోనే ఎత్తైన హోటల్ గా నిలవనుంది. ఇప్పుడు ఇది పర్యాటకులకు అందుబాటులోకి వచ్చింది. 75 అంతస్థులలతో కూడిన ఈ హోటల్ భవనం అంతకు ముందు దుబాయ్ లోని జె డబ్ల్యు మారియట్ మాక్వెస్ పేరుతో ఉన్న రికార్డును బద్దలు కొట్టింది.

కాకపోతే ఈ తేడా కేవలం ఒక మీటర్ మాత్రమే కావటం విశేషం. జీవోరా హోటల్ లో 528 విలాసవంతమైన రూమ్ లు.అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. దుబాయ్ ప్రపంచంలోనే అత్యధిక బిల్డింగ్ రికార్డును కూడా కలిగి ఉన్న విషయం తెలిసిందే. 828 మీటర్ల ఎత్తుతో బుర్జ్ ఖలీఫా ఈ రికార్డును సొంతం చేసుకుంది.

Next Story
Share it