శ్రీదేవిది హత్యే!

ఈ సంచలన వ్యాఖ్యలు చేసింది ఎవరో తెలుసా?. బిజెపి ఎంపీ సుబ్రమణ్యస్వామి. సంచనాలకు కేంద్ర బిందువుగా ఉండే ఆయన శ్రీదేవి విషయంలోనే అలాగే వ్యవహరించారు. శ్రీదేవి హత్యే అని ఆయన ప్రకటించారు. శ్రీదేవి గదిలోకి ఎవరెవరు వెళ్ళారో వారి వివరాలతో కూడిన సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు విడుదల చేయటం లేదని ఆయన ప్రశ్నించారు. సినీ తారలతో దావూద్ ఇబ్రహీంకు ఉన్న సంబంధాలపైనా విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికే శ్రీదేవి మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ తరుణంలో సుబ్రమణ్యస్వామి వ్యాఖ్యలు మరింత కలకలం రేపుతున్నాయి.శ్రీదేవికి మద్యం సేవించే అలవాటు లేదంటూ.. దుబాయ్ ఫోరెన్సిక్ రిపోర్టులో వెల్లడైన అంశాలపై ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
డాక్టర్లు అకస్మాత్తుగా మీడియా ముందుకు వచ్చి గుండెపోటుతో చనిపోయారని ప్రకటించారని.. ఈ నేపథ్యంలో ఆమెతో బలవంతంగా మద్యం సేవించారా అనేది తేలాలన్నారు. గుండెపోటుతో చనిపోయారని ప్రకటించడం ముందస్తు వ్యూహంలో భాగంగానే జరిగిందని భావిస్తున్నానన్నారు. మీడియాలో వస్తున్న విషయాలు వాస్తవాలు స్థిరంగా ఉండవన్నారు. అసలు ఏం జరిగిందనేది పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రకటించే దాకా వేచి వుండాలని సుబ్రమణ్యస్వామి పేర్కొన్నారు.