మిస్టరీగా శ్రీదేవి మృతి!

బాత్ టబ్ లో పడిపోతే ఎవరికైనా గాయాలు అవుతాయి. దెబ్బలు తగులుతాయి. భయంతో హార్ట్ ఎటాక్ కు ఛాన్స్ ఉంటుంది. కానీ ఏకంగా బాత్ టబ్ లో పడిపోయి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంటుందా?. పోనీ అది ఏమైనా స్విమ్మింగ్ పూల్ లాంటిది అయినా ఒకింత ప్రమాదానికి ఛాన్స్ లు ఎక్కువ ఉంటాయి. కానీ బాత్ టబ్ లో పడిపోయి శ్రీదేవి ప్రాణాలు విడిచారని చెప్పటంపై ఇఫ్పుడు పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇది ఒక్కటే కాదు..వరస పెట్టి కొత్త కొత్త అనుమానాలు పుట్టుకొస్తున్నాయి. చూడబోతుంటే శ్రీదేవి మృతి పెద్ద మిస్టరీగా మారే పరిస్థితి కన్పిస్తోంది. అయితే సోమవారం ఉదయం వరకూ అందరూ గుండెపోటుతోనే శ్రీదేవి మరణించారని భావించారు. కానీ దుబాయ్ ఫోరెన్సిక్ నివేదికలో అది ప్రమాదంగా తేలటంతో అంతా ఒక్కసారిగా గందరగోళంగా మారింది. ఈ వ్యవహారం ఇప్పుడు ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచిచూడాల్సిందే. శ్రీదేవీ గుండెపోటుతో చనిపోలేదని, ప్రమాదవశాత్తు బాత్‌టబ్‌లో పడిపోవడం వల్ల ఊపిరాడక చనిపోయారంటూ ఫోరెన్సిక్ రిపోర్టు తెలిపింది.
మేనల్లుడు పెళ్లి వేడుకకు వెళ్లిన శ్రీదేవీ తాను ఒక్కతే ఎందుకు దుబాయ్‌లోనే ఉండాలనుకున్నారు? ఎందుకు బోనీ కపూర్ మళ్లీ శ్రీదేవీని కలవడానికి ముంబై నుంచి దుబాయ్ వెళ్లారు? అంటూ పలు ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. తొలుత కార్డియాక్ అరెస్ట్ అని, తర్వాత బాత్‌టబ్‌లో పడిపోయి చనిపోయిరని ఎందుకు చెప్పారని కూడా నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటి వరకు బోనీ కపూర్ శ్రీదేవీ మృతిపై స్పందించలేదు. ఫోరెన్సిక్ నివేదిక ఇచ్చిన తర్వాత శ్రీదేవి మృతి కేసును మరింత లోతుగా విచారించేందుకు దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు బదిలీ చేసినట్లు పోలీసులు ట్విట్టర్ లో పేర్కొన్నారు. మరణించిన సమయంలో శ్రీదేవి కొద్ది మొత్తంలో మద్యం సేవించినట్లు చెబుతుంటే..ఆమెకు అసలు ఆల్కహాల్ సేవించే అలవాటు లేదని రాజ్యసభ ఎంపీ అమర్ సింగ్ చెబుతున్నారు. ఆమె ఎప్పుడైనా వైన్ మాత్రమే తీసుకునేవారు తప్ప..ఆమెకు మద్యం సేవించే ఆలవాటు లేదన్నది ఆయన వాదనగా ఉంది. బాత్‌టబ్‌లో పడిపోయిన తర్వాత ఎంత సేపటికి ఆమెను గుర్తించారు? తనంతట తానే పడిపోయిందా? లేదా ఆమెను ఇంకెవరైనా బాత్‌టబ్‌లోకి తోసేశారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
కెసీఆర్ పెద్ద పరీక్షే పెట్టుకున్నారు..అందులో విజయం సాధ్యమా?!
2 July 2022 12:50 PM GMTస్పైస్ జెట్ విమానంలో పొగ..ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరి
2 July 2022 5:36 AM GMTఆవో-దేఖో-సీకో
1 July 2022 3:17 PM GMTనుపుర్ శర్మపై సుప్రీం ఫైర్
1 July 2022 6:58 AM GMTఏపీలో సర్కారు వారి 'సినిమా ఆగింది'
1 July 2022 6:24 AM GMT
ప్రేమలేఖలు అందాయన్న శరద్ పవార్
1 July 2022 6:05 AM GMTఫడ్నవీస్ కు అధిష్టానం షాక్..డిప్యూటీ సీఎం పదవి
30 Jun 2022 2:04 PM GMTవ్యూహాం మార్చిన బిజెపి..శివసేనను పూర్తిగా ఖతం చేసేందుకేనా!
30 Jun 2022 12:27 PM GMTముంబయ్ చేరుకున్న ఏక్ నాథ్ షిండే
30 Jun 2022 9:42 AM GMTసంజయ్ రౌత్ కు ఈడీ నోటీసులు
27 Jun 2022 12:15 PM GMT