శ్రీదేవి కేసు క్లోజ్

ఊహించని రీతిలో శ్రీదేవి ఆకస్మిక మృతి. పలు సందేహాలు. ముందు గుండెపోటు అన్నారు..తర్వాత బాత్ టబ్ లో ప్రమాదం అన్నారు. ఏకంగా బిజెపి ఎంపీ సుబ్రమణ్యస్వామి అయితే ఏకంగా శ్రీదేవిది హత్యే అని తేల్చారు. ఇలా రకరకాలుగా భిన్న అంశాలు ప్రచారంలోకి వచ్చాయి. అన్నింటికి తెరదించుతూ దుబాయ్ ప్రాసిక్యూషన్ అధికారులు కేసును క్లోజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో బోనీకపూర్ కూడా దుబాయ్ నుంచి ముంబయ్ కు రావటానికి మార్గం సుగమం అయింది. శ్రీదేవి మృతి ప్రమాదవశాత్తు జరిగినా మరణం తప్ప ..ఇందులో ఎలాంటి కుట్ర కోణం లేదని దుబాయ్ ప్రాసీక్యూషన్ అధికారులు తేల్చేశారు. దర్యాప్తు ఇక ముగిసిందని, కేసును క్లోజ్ చేశామని, ఇక ఎలాంటి అనుమానాలు లేవంటూ స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రాసిక్యూషన్ అధికారులు అధికారిక ప్రకటన చేశారు. శనివారం రాత్రి 11 దాటిన తర్వాత శ్రీదేవి హఠాన్మరణం చెందారు. అయితే, ఆమె గుండెపోటుతో చనిపోయారని తొలుత ప్రచారం జరిగింది. ఆమెకు పోస్టు మార్టం నిర్వహించిన తర్వాత వైద్యులు చేసిన పరీక్షల్లో ఆమె ప్రమాదవ శాత్తు నీటిలో పడి ఊపిరి ఆడక చనిపోయారని తేల్చేశారు. ఆమె దేహంలో ఆల్కహాల్‌కు సంబంధించిన ఆనవాళ్లు కనిపించాయని, బహుశా స్నానానికి వెళ్లిన ఆమె పట్టును కోల్పోయి కాలు జారి టబ్‌లో పడిపోయి ఉంటారని, ఆ క్రమంలోనే ఊపిరి ఆడక చనిపోయారని అన్నారు.
ఈ క్రమంలో బోనీ కపూర్‌ను కొన్ని గంటలపాటు మూడుసార్లు విచారించడం, ఆమె మృతదేహాన్ని అప్పగించేందుకు తొలుత ప్రాసీక్యూషన్ అధికారులు అంగీకరించకపోవడంతో బహుశా ఏవో బలమైన కారణాలే ఆమె చావుకు కారణం అయి ఉంటాయని భిన్న కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. ఆమె బాత్ టబ్‌లో అనుకోకుండా పడ్డారా? ఎవరైనా తోసేశారా? లేకుంటే ఏవైనా సమస్యలతో శ్రీదేవినే బలవన్మరణానికి పాల్పడ్డారా? బోనీ కపూర్ ఇండియాకు వచ్చి మళ్లీ సర్‌ప్రైజ్ పేరుతో దుబాయ్ వెళ్లడం ఏమిటి? అన్న అనుమానాలు ఎన్నో పుట్టుకొచ్చాయి. తర్వాత శ్రీదేవి ఫోన్ కాల్ లిస్ట్ కూడా వెరిఫై చేశారు. శ్రీదేవి చివరి సారిగా ఎవరితో మాట్లాడారు? ఎక్కువగా ఎన్నిసార్లు ఎవరికి ఫోన్ చేశారు? అన్న అంశాలను కూడా పరిశీలించారు. చివరకు అన్ని ప్రచారాలను పక్కన పెడుతూ అపస్మారక స్థితిలో బాత్ టబ్ లో పడిపోవటం వల్లే శ్రీదేవి మరణించారని అంతిమంగా తేల్చారు.
నాలుగేళ్ల తర్వాత పారిశ్రామికవేత్తలకు కాపలా కాయాలా?
27 Jun 2022 12:45 PM GMTసంజయ్ రౌత్ కు ఈడీ నోటీసులు
27 Jun 2022 12:15 PM GMTబిజెపి నిరంకుశ తీరుకు వ్యతిరేకంగానే...కెటీఆర్
27 Jun 2022 11:58 AM GMTటీచర్ల ఆస్తుల దగ్గర మొదలై..కెసీఆర్ ఆస్తుల వరకూ...
25 Jun 2022 4:06 PM GMTఅమ్మకానికి అమరావతి భూములు
25 Jun 2022 2:06 PM GMT
సంజయ్ రౌత్ కు ఈడీ నోటీసులు
27 Jun 2022 12:15 PM GMTరాజీనామాకు రెడీ..పదవుల కోసం పాకులాడను
22 Jun 2022 2:28 PM GMT'మహా' ట్రబుల్ షురూ
21 Jun 2022 5:51 AM GMTఅసలు మోడీ తల్లి వయస్సు ఎంత?
20 Jun 2022 3:43 PM GMTమోడీ సర్కారు ఆరోపణల విముక్తి పథకం
20 Jun 2022 12:10 PM GMT