Telugu Gateway
Cinema

విల్లేపార్లేలో శ్రీదేవి అంత్యక్రియలు

విల్లేపార్లేలో శ్రీదేవి అంత్యక్రియలు
X

ప్రముఖ నటి శ్రీదేవి భౌతికకాయం దుబాయ్ నుంచి ముంబయ్ చేరుకుంది. ప్రజల సందర్శన అనంతరం బుధవారం మధ్యాహ్నాం అంత్యక్రియలు జరిపేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు శ్రీదేవి కుటుంబ సభ్యులు మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. అత్యంత భావోద్వేగ సమయంలో తమకు అండగా నిలిచిన మీడియాకు బోనీకపూర్ ఈ ప్రకటనలో కృతజ్ణతలు తెలిపారు.

బుధవారం ఉదయం తొమ్మిదిన్నర నుంచి పన్నెండున్నర వరకూ ప్రజల సందర్శనార్ధం శ్రీదేవి భౌతికకాయాన్ని సెలబ్రేషన్ స్పోర్ట్స్ క్లబ్ లో ఉంచుతారని తెలిపారు. తర్వాత రెండు గంటల నుంచి అంతిమ యాత్ర మొదలై..మూడున్నర వరకూ సాగనుంది. తర్వాత విల్లే పార్లే సేవా సమాజ్ హిందూ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

Next Story
Share it