చంద్రబాబు మళ్ళీ గెలిస్తేనే..సింగపూర్ సంస్థలు మందుకు!

అడ్డగోలుగా నిబంధనలు ఉల్లంఘించి సింగపూర్ సంస్థలకు స్విస్ ఛాలెంజ్ విధానంలో అమరావతిలో ‘‘స్టార్టప్ ఏరియా’ ప్రాజెక్టు అప్పగించినా..అవి ఎందుకు ముందుకు రావటం లేదు. ఒప్పందంలే లేని విధంగా కొత్త కంపెనీని ఎందుకు తెరపైకి తెస్తున్నాయి. ఈ కంపెనీని ఎందుకు సర్కారు అనుమతించాలని చూస్తోంది. అసలు ఒప్పందంలో లేని ‘హోల్డింగ్ కంపెనీ’ ఎందుకు తెరపైకి వచ్చింది. ఇవన్నీ ఇప్పుడు సమాధానం లేని ప్రశ్నలు. అయితే సింగపూర్ సంస్థలకు వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు గెలుపుపై సందేహంతో ఉన్నాయని..ఈ తరుణంలో వందల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఇరుక్కోవటం ఎందుకనే ఉద్దేశంతో అవి ఆచితూచి అడుగులు వేస్తున్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి ఈ ప్రాజెక్టులో సింగపూర్ సంస్థలు పెట్టే పెట్టుబడి చాలా నామమాత్రమే అయినా కూడా ఈ సంస్థలు వెనకంజ వేస్తున్నాయని చెబుతున్నారు. ప్రభుత్వం మారితే తమకు చిక్కులు తప్పవనే భయంతో సింగపూర్ సంస్థలు ఉన్నాయని..ఏమైనా కూడా అవి వచ్చే ఎన్నికల ఫలితాల చూసిన తర్వాతే తమ పనులు ప్రారంబించే అవకావం ఉందని చెబుతున్నారు. అందుకే సర్కారు స్విస్ ఛాలెంజ్ విధానం కింద ప్రాజెక్టు అప్పగించి ఎనిమిది నెలలు దాటినా పనులు మొదలుపెట్టకుండా కొత్త కొత్త ఆంక్షలు పెడుతున్నాయని చెబుతున్నారు.
ఈ సంస్థలకు ఉన్నసమాచారం ప్రకారం వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు గెలుపు అంత సులువుకాదనే అభిప్రాయంతో ఉన్నందునే ఆచితూచి స్పందిస్తున్నాయని చెబుతున్నారు. ఇంతకుమించి మరే బలమైన కారణంలేదని..సింగపూర్ కంపెనీలు ఏమి కోరితే అందుకు ఓకే అంటూ సర్కారు వాళ్ల ముందు సాగిలపడినా ఇప్పుడు ప్రయోజనం లేకుండా పోతోందని చెబుతున్నారు. రాజధాని విషయంలో అసలు చంద్రబాబు సింగపూర్ సంస్థల జపం ఏ స్థాయిలో చేశారో అందరూ చూసిందే. అసలు రాజధాని నిర్మాణమే సింగపూర్ సంస్థలు చేపడతాయని ప్రజలను భ్రమింపచేసి..తర్వాత స్టార్టప్ ఏరియా..ప్రైవేట్ సంస్థలకు అవసరమైన మౌలికసదుపాయాలు అంటూ కొత్త విషయాన్ని వెలుగులోకి తెచ్చిన అంశం విదితమే. సర్కారు ఎంత సాగిలపడినా కూడా సింగపూర్ సంస్థలు మాత్రం తాము అనుకున్న విధంగా ముందుకు సాగుతున్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి.
మునుగోడు ఉప ఎన్నిక..టీఆర్ఎస్ అనుకుంటే వస్తది..లేదంటే లేదు!
2 Aug 2022 2:38 PM GMTఎలన్ మస్క్ ప్రైవేట్ ఎయిర్ పోర్టు!
2 Aug 2022 12:41 PM GMTఏటీఎంలో 'స్ట్రక్ అయిన బిజెపి అగ్రనేతలు!'
2 Aug 2022 12:04 PM GMT'మ్యూట్' లో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్!
2 Aug 2022 6:45 AM GMTదిల్ రాజు 'డబుల్ గేమ్' దుమారం!
1 Aug 2022 3:16 PM GMT
మునుగోడు ఉప ఎన్నిక..టీఆర్ఎస్ అనుకుంటే వస్తది..లేదంటే లేదు!
2 Aug 2022 2:38 PM GMTఏటీఎంలో 'స్ట్రక్ అయిన బిజెపి అగ్రనేతలు!'
2 Aug 2022 12:04 PM GMTజగన్ ..మీరు తోడుదొంగలు..సోము వీర్రాజుకు అమరావతి రైతుల షాక్!
29 July 2022 7:53 AM GMTగజ్వేల్ అయినా రెడీ..హుజూరాబాద్ అయినా ఓకే
26 July 2022 2:57 PM GMTమునుగోడు బలం బిజెపిదా..రాజగోపాల్ రెడ్డిదా?!
26 July 2022 10:58 AM GMT