‘రవితేజ’ సినిమాకు రికార్డు రేట్!

సెకండ్ ఇన్నింగ్స్ లో రవితేజ దూసుకెళుతున్నాడు. రాజా ది గ్రేట్ తో పోలిస్తే ‘టచ్ చేసి చూడు’ సినిమా పెద్దగా హిట్ కాకపోయినా రవితేజ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. ఎందుకంటే రవితేజ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘నేలటికెట్’ సినిమాకు సంబంధించి పలికిన రేటు టాలీవుడ్ లో ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ గా మారింది. నేలటికెట్ సినిమాకు సంబందించిన డిజిటల్, శాటిలైట్, హిందీ డబ్బింగ్ రైట్స్ ను ఓ ప్రముఖ టీవీ ఛానల్ 25 కోట్లకు సొంతం చేసుకున్నట్లు సమాచారం.
ఇంత భారీ ధర చెల్లించేందుకు ఛానల్ ముందుకు రావటం పరిశ్రమలో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. నేలటికెట్ సినిమాను సోగ్గాడే చిన్ని నాయనా, రారండోయ్ వేడుక చూద్దాం లాంటి రెండు వరుస విజయాల తరువాత కళ్యాణ్ కృష్ణ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో మాళవిక శర్మ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సినిమాకు సంబంధించిన బిజినెస్ కూడా దాదాపుగా పూర్తయినట్టుగా చిత్రయూనిట్ ప్రకటించారు.
కెసీఆర్ పెద్ద పరీక్షే పెట్టుకున్నారు..అందులో విజయం సాధ్యమా?!
2 July 2022 12:50 PM GMTస్పైస్ జెట్ విమానంలో పొగ..ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరి
2 July 2022 5:36 AM GMTఆవో-దేఖో-సీకో
1 July 2022 3:17 PM GMTనుపుర్ శర్మపై సుప్రీం ఫైర్
1 July 2022 6:58 AM GMTఏపీలో సర్కారు వారి 'సినిమా ఆగింది'
1 July 2022 6:24 AM GMT
ప్రేమలేఖలు అందాయన్న శరద్ పవార్
1 July 2022 6:05 AM GMTఫడ్నవీస్ కు అధిష్టానం షాక్..డిప్యూటీ సీఎం పదవి
30 Jun 2022 2:04 PM GMTవ్యూహాం మార్చిన బిజెపి..శివసేనను పూర్తిగా ఖతం చేసేందుకేనా!
30 Jun 2022 12:27 PM GMTముంబయ్ చేరుకున్న ఏక్ నాథ్ షిండే
30 Jun 2022 9:42 AM GMTసంజయ్ రౌత్ కు ఈడీ నోటీసులు
27 Jun 2022 12:15 PM GMT