టీడీపీ ఎంపీలను జోకర్లు అన్న రామ్ గోపాల్ వర్మ
BY Telugu Gateway12 Feb 2018 10:18 AM IST

X
Telugu Gateway12 Feb 2018 10:18 AM IST
తెలుగుదేశం ఎంపీలపై వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంత మంది ఎంపీలనుద్దేశించి ఆయన ట్విట్టర్ లో చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. వర్మ ట్విట్టర్ లో ఏమన్నారో మీరే చూడండి. ‘ఇలాంటి జోకర్లు ఏపీ ప్రజలకు ప్రతినిధులుగా ఎన్నిక కావటం చూస్తున్న నరేంద్ర మోదీ బహుశా ఏపీని ఓ జోక్‌గా భావిస్తున్నాడేమో. వీరు జోకర్లకు తక్కువ’ అంటూ ఓ బ్లాంక్ ను వదిలేశారు. ఇక మరో ట్వీట్లో ‘టీడీపీకి చెందిన వీళ్లు అంతర్జాతీయ స్థాయిలో గౌరవం ఉన్న తెలుగు దేశం పార్టీ పరువును జాతీయ స్థాయిలో అవమానానికి గురి చేస్తున్నారు’ అంటూ మరో ట్వీట్ చేశాడు’ వర్మ.
Next Story



