Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

మోడీ మోసం కంటే..చంద్రబాబు మోసమే ఎక్కువ!

0

ఆంధ్రప్రదేశ్ కు ప్రధాని నరేంద్ర మోడీ చేసిన  మోసం కంటే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేస్తున్న మోసమే  ఎక్కువ?. అవునంటున్నాయి అధికార వర్గాలు. అది ఎలా అంటారా?. ఏ మాత్రం లాజికల్ గా ఆలోచించినా ఈ విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. ఆయన చర్యలను గమనిస్తే ఇది కళ్లకు కట్టినట్లు కన్పిస్తుంది. అది ఎలాగో మీరూ చూడండి.

  1. హోదా బదులు ప్యాకేజీకి అంగీకరించారు. హోదా కంటే ప్యాకేజీలోనే ఎక్కువ వస్తాయని చెప్పారు. కానీ ప్యాకేజీలో ఏమీలేదు..రావటంలేదని సీఎం చంద్రబాబు మొదలుకుని టీడీపీ మంత్రులు..నేతలు చెబుతున్నారు. అంటే హోదా విషయంలో చంద్రబాబు బిజెపి ఒత్తిడికి తలొగ్గి వదిలేసినట్లే కదా?.. ఏపీ ప్రజలను మోసం చేసినట్లే కదా?.

- Advertisement -

2.కేంద్రంతో గొడవ పడితే పోలవరం ఆగిపోతుంది..ప్రాజెక్టులకు ఇబ్బందులు ఎదురవుతాయి?. గొడవ పడితే డబ్బులు ఇవ్వకపోవటానికి ఇది ఏమైనా మోడీ, చంద్రబాబుల ప్రైవేట్ వ్యవహారమా?. చట్టంలోనే పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ఉంది?. చేస్తున్న పని ప్రకారం నిధులు చెల్లించాల్సిందే. అంతే కానీ….నువ్వు నాతో గొడవ పడ్డావు కాబట్టి..నేను నీకు డబ్బులు ఇవ్వను అనటం ఏ కేంద్ర ప్రభుత్వానికి అయినా సాధ్యం అవుతుందా?. అన్యాయం పై కోర్టుకెళతానన్న చంద్రబాబు నిజంగా కేంద్రం అలా చేస్తే అందరినీ కలుపుకుని ప్రశ్నించలేరా?. చంద్రబాబుకు ఆ మాత్రం తెలియదని మనం అనుకోగలమా?.

  1. ఇంత కాలం సఖ్యతతో ఉండి సాధిస్తాం. గొడవపడితే ఏమి వస్తుందని ప్రజలను నమ్మించారు?. ఓకే.. నాలుగేళ్లుగా సఖ్యతతో ఉండి రాష్ట్రానికి రావాల్సినవి కూడా సాధించకుండా ఏపీ ప్రజలను మోసం చేస్తుంది చంద్రబాబు కాదా?.
  2. బడ్జెట్ ప్రకటన వచ్చినప్పటి నుంచి అంతా లీకుల మీదే నడిపించారు. ఆగ్రహం..రాజీనామాలు..మంత్రులు బయటికి అంటూ లీకులిచ్చారు. ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని ప్రకటించారు. ప్రజల ఫీలింగ్ కేంద్రానికి చెప్పాల్సిందే అని ప్రకటించారు. మరి ప్రజలు ఆగ్రహంగా ఉంటే ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అంత కూల్ గా ఎందుకు ఉన్నట్లు?.
  3. ‘అవసరం అయితే’ పార్లమెంట్ లో ఆందోళన చేస్తామంటూ కేంద్ర మంత్రి సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలే చంద్రబాబు దగ్గర జరిగిన భేటీలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో చెప్పకనే చెప్పాయి.
  4. ఎంపీలు అంత తీవ్రంగా రాజీనామాలు ఎందుకు చేస్తామన్నారు? కేంద్ర మంత్రులను ప్రభుత్వం నుంచి బయటకు రావాలని కొంత మంది ఎంపీలు ఎందుకు సూచించారు. మరి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సొంత ఎంపీలు, కీలక నేతలు చెప్పిన మాటలను ఎందుకు పెడచెవిన పెట్టారు?
  5. కేంద్రంలో మంత్రివర్గ సభ్యులుగా ఉన్న అశోక్ గజపతిరాజు అయితే ఇంతటి కీలక సమావేశానికి హాజరే కాలేదు. వచ్చిన సుజనా చౌదరి టీడీపీపీ సమావేశంలో కేంద్ర, రాష్ట్ర సంబంధాల గురించి చర్చించినట్లు ప్రకటించారు. అంటే బడ్జెట్ లో ఏపీకి జరిగిన అన్యాయంపై చంద్రబాబు సీరియస్ నెస్ తెలిసిపోతోంది.
  6. అసలు సమస్య..కేంద్ర బడ్జెట్ లో ప్రత్యేక ప్యాకేజీ కానీ..రాజధాని..రైల్వే జోన్ వంటి అంశాలకు ఏ మాత్రం కేటాయింపులు చేయకపోవటం అయితే.. నాలుగేళ్ల తర్వాత విభజన సమస్యలు గురించి మాట్లాడితే ప్రయోజనం ఏముంటుంది?. విభజన సమస్యల నుంచి బయటపడేయాలనేగా కేంద్రాన్ని అడిగేది. వాటినే కదా?. కేంద్రం పట్టించుకోనిది. ఏమీ పట్టించుకోకపోయినా ఎందుకు చంద్రబాబు అంత కూల్ గా ఉన్నారు?. నాలుగేళ్ల ‘సఖ్యత’ ఫలితాలు ఆయన చూడలేదా?.
  7. టీడీపీపీ కీలక సమావేశం…కేంద్రంలో కొనసాగటంపై చంద్రబాబు కఠిన నిర్ణయం అంటూ జాతీయ, రాష్ట్ర స్థాయి మీడియాలో హంగామా చేసినా అటు ప్రధాని మోడీ కానీ..ఇటు అమిత్ షా లు చాలా లైట్ తీసుకున్నట్లే కన్పిస్తోంది. టీవీలు అమిత్ షా భయపడిపోయి చంద్రబాబుకు ఫోన్ చేశారని ప్రచారం చేసినా..తమ సమావేశం ముగిసే వరకూ అలాంటి ఫోన్ ఏమీ రాలేదని సుజనా చౌదరి తేల్చిచెప్పారు.
  8. ఎంతో సీనియర్ అయిన చంద్రబాబు కేంద్రంలో అటు మోడీ..ఇటు అమిత్ షాలను భయపెడతారనే రేంజ్ లో బిల్డప్ ఇస్తే..సీన్ రివర్స్ లో టీడీపీనే భయపడి ‘కవరింగ్’ ఇచ్చుకున్నట్లు తాజా సమావేశంతో తేలిపోయింది.

 

Leave A Reply

Your email address will not be published.