‘మిలియన్’ ఫాలోయర్ల క్లబ్లులో కెటీఆర్
BY Telugu Gateway9 Feb 2018 11:07 AM IST

X
Telugu Gateway9 Feb 2018 11:07 AM IST
తెలంగాణ ఐటి, మునిసిపల్ శాఖ మంత్రి కెటీఆర్ ఓ కీలకమైలు రాయిని అందుకున్నారు. ట్విట్టర్ లో మంత్రి కెటీఆర్ ను ఫాలో అయ్యేవారి సంఖ్య మిలియన్ (పది లక్షలు)కు చేరుకుంది. మంత్రి ట్విట్టర్ లో చాలా చురుకుగా ఉండే విషయం తెలిసిందే. తన అభిప్రాయాలను ట్విట్టర్ వేదికగా పంచుకోవటంతో పాటు..ప్రజలు ట్విట్టర్ వేదికగా తెలియజేసే సమస్యలకు కూడా స్పందిస్తుంటారు.
అప్పుడప్పుడు నెటిజన్లతో ట్విట్టర్ వేదికగా వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంటారు. ట్విట్టర్ లో తన ఖాతాను ఫాలో అయ్యే వారి సంఖ్య పది లక్షలకు చేరటంపై కెటీఆర్ స్పందించారు. మిలియన్ థ్యాంక్స్ అంటూ ట్వీట్ చేశారు. తెలంగాణ మంత్రివర్గంలో ట్విట్టర్ వేదికగా చురుగ్గా ఉండే మంత్రి కెటీఆర్ ఒక్కరే అని చెప్పొచ్చు.
Next Story



