మార్చి23న ‘ఎమ్మెల్యే’ విడుదల
BY Telugu Gateway24 Feb 2018 4:17 AM GMT

X
Telugu Gateway24 Feb 2018 4:17 AM GMT
ఎమ్మెల్యే అంటే మనకు తెలిసింది మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. కానీ ఇక్కడ ఎమ్మెల్యే అంటే మంచి లక్షణాలు ఉన్న అబ్బాయి అట. ఆ అబ్బాయి ఎవరు అనుకుంటున్నారా?. ఆయనే నందమూరి కళ్యాణ్ రామ్. కళ్యాణ్ రామ్, కాజల్ జంటగా నటించిన ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. మార్చి23న సినిమాను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.
కళ్యాణ్ రామ్ నిర్మాతగా ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కించిన చిత్రం జైలవకుశ బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్ సాధించింది. ఓవైపు నిర్మాతగా వ్యవహరిస్తూనే మరో వైపు కళ్యాణ్ రామ్ హీరోగా సినిమాలు చేస్తున్నారు. ఎమ్మెల్యే సినిమాకు ఉపేంద్ర మాధవ్ దర్శకత్వం వహిస్తున్నారు. కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి నిర్మాతలుగా ఉన్నారు.
Next Story