‘జస్టిస్’ పవన్ కళ్యాణ్!
ఇదేదో ఆయన కొత్త సినిమా టైటిల్ అనుకునేరు. ఏ మాత్రం కానే కాదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు కొత్త పాత్ర పోషించబోతున్నారా?. అంటే పరిణామాలు ఆ దిశసాగే సాగుతున్నట్లు కన్పిస్తున్నాయి. కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు తీవ్ర అన్యాయం జరిగిందనే విమర్శలు వెల్లువెత్తినా..బడ్జెట్ ప్రకటన తర్వాత ఆయన చాలా కాలం మౌనంగానే ఉండిపోయారు. కొద్ది రోజుల క్రితం మళ్ళీ ఫీల్డ్ లోకి దిగారు. ఇంత కాలం ప్రజల తరపున సమస్యలపై ప్రశ్నిస్తానని ప్రకటించిన పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనూ ప్రభుత్వాలకు అనుకూలంగా మాట్లాడుతూ కొత్త రాజకీయాల కు తెరతీశారు. ప్రత్యేక హోదా విషయంలో అధికార టీడీపీ ఎన్ని పిల్లిమొగ్గలు వేయాలో అన్నీవేసింది. అసలు ప్యాకేజీతో పోలిస్తే హోదాతో ఏమీ రావని తరహాలో ప్రచారం చేసి...ప్యాకేజీ ప్రకటించాక పండగ తరహాలో ఉత్సవాలు చేసుకున్నారు. గత ఏడాది జనవరి 27న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విలేకరుల సమావేశం పెట్టి మరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ప్రత్యేక హోదాతో సమానవైనవీ అన్నీ వచ్చాయి. ఏ రాష్ట్రానికైనా ఇంత కంటే ఎక్కువ వచ్చాయా?. మనమే ఎక్కువ సాధించాం ’ అంటూ వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఏమో కేంద్రం మోసం చేసింది హోదా లేదు..ప్యాకేజీ లేదు..మోసం అంటూ గగ్గోలు పెడుతున్నారు. మరి అప్పటి చంద్రబాబు సవాళ్ళు ఏమయ్యాయి.
గత అనుభవాలను చూస్తే పవన్ కళ్యాణ్ ఇప్పుడు కేంద్రం నుంచి సాయం విషయంలో చేసే ప్రయత్నాలు ఎవరి కోసమే కొంత కాలం వేచిచూస్తే తప్ప తెలియదు. అయితే పవన్ కళ్యాణ్ తాజాగా డిమాండ్ పెట్టినట్లు ఫిబ్రవరి 15 నాటికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయనకు సమాచారం ఇస్తాయా?. గతంలో పవన్ ఏపీకి చెందిన ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టు విషయం శ్వేతపత్రం కోరగా..అందుకు సర్కారు నో అంది. పవన్ కళ్యాణ్ కొత్తగా ఏర్పాటు చేసే జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ (జెఎఫ్ సీ) ప్రకటించారు. ఇప్పటికే లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణతో భేటీ అయిన పవన్ కళ్యాణ్..ఇప్పుడు ఆదివారం నాడు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ తో భేటీ అయ్యారు. వీరిద్దరితో పాటు మరికొంత మందికి కూడా కమిటీలో చోటు కల్పించనున్నట్లు పవన్ చెబుతున్నారు.ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి టీడీపీనే సాధించలేక..ఇప్పుడు పోరాడతామని చెబుతోంది. ప్రభుత్వ చర్యలకు ఆటంకం కల్పించటం ఇష్టంలేదని చెప్పే పవన్ కళ్యాణ్ ఈ విషయంలో సక్సెస్ సాదించగలరా?. పవన్ తలపెట్టిన ఈ జెఎఫ్ సీ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో వేచిచూడాల్సిందే. ప్ర