Telugu Gateway
Cinema

ఫస్ట్ మహేష్ బాబు..నెక్ట్స్ అల్లు అర్జున్

ఫస్ట్ మహేష్ బాబు..నెక్ట్స్ అల్లు అర్జున్
X

టాప్ హీరోల సమ్మర్ సందడి షెడ్యూల్ మారింది. సినీ పరిశ్రమలో ఈ మధ్య ‘సర్దుబాట్ల’ జోరు పెరిగింది. పెద్ద సినిమాల విడుదల తేదీలు ఎక్కడైనా క్లాష్ అయితే..వెంటనే నిర్మాతలు రంగంలోకి దిగి తమ తమ ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతినకుండా చూసుకుంటున్నారు. ప్రస్తుతం ఎంత పెద్ద సినిమా అయినా మొదటి వారం కలెక్షన్లే కీలకంగా మారిన విషయం తెలిసిందే. గత కొంత కాలంగా టాలీవుడ్ లో ఈ సర్దుబాటు ట్రెండ్ కొనసాగుతోంది. తెలుగు పరిశ్రమలో టాప్ హీరోలుగా ఉన్న మహేష్ బాబు, అల్లు అర్జున్ సినిమాలకు సంబంధించి కూడా ఇదే ఫార్ములాను వర్కవుట్ చేశారు. తొలుత ఈ రెండు సినిమాలు ఏప్రిల్ 27 తేదీన విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. రెండు సినిమాల నిర్మాతల మధ్య సాగిన చర్చల కారణంగా ఈ మార్పులు చోటుచేసుకున్నాయి. దీంతో భరత్‌ అను నేను ఏప్రిల్‌ 20న , నా పేరు సూర్య మే 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్లు చిత్ర నిర్మాతలు తెలిపారు. మహేశ్‌ బాబు కొరటాల కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ‘భరత్‌ అను నేను’పై అంచనాలు భారీగానే ఉన్నాయి.

అయితే మహేష్ తాజా సినిమాలు అన్నీ డిజాస్టర్ గా మారటంతో ఆయన అభిమానులు ఈ సినిమాపై భారీ ఆశలే పెట్టుకున్నారు. మహేశ్‌ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తూ వచ్చిన ఆడియో ఇప్పటికే అభిమానులను ఆకట్టుకుంది. అల్లు అర్జున్ విషయానికి వస్తే దువ్వాడ జగన్నాధం వంటి హిట్‌ తర్వాత అల్లు అర్జున్‌ నటిస్తున్న చిత్రం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా. వక్కంతం వంశీ మొదటిసారిగా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఒకేసారి తలపడటం వల్ల నష్టం వస్తుందని...దీనికి తోడు థియేటర్ల సమస్యలు కూడా వస్తాయని భావించి..ఇద్దరూ సర్దుబాటుకు అంగీకరించి..డేట్లు నిర్ణయించుకున్నారు. సో..ఒక వారంలో మహేష్ బాబు, మరో వారంలో అల్లు అర్జున్ సినిమాలు సందడి చేస్తాయన్న మాట.

Next Story
Share it