Telugu Gateway
Cinema

ధృడమైన మహిళల హృదయాలు బలహీనంగా ఉంటాయి

ధృడమైన మహిళల హృదయాలు బలహీనంగా ఉంటాయి
X

శ్రీదేవి మరణానికి గల కారణాలపై సోషల్ మీడియాలో రకరకాల చర్చలు సాగుతున్నాయి. కొంత మంది నెటిజన్లు ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తున్నారు. అందాన్ని కాపాడుకునేందుకు ఆమె చేయించుకున్న సర్జరీలే కారణమనే విమర్శలు విన్పిస్తున్నాయి. వీటిపై టీవీ షోల నిర్మాత ఏక్తా కపూర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ధృడమైన మహిళల హృదయాలు బలహీనంగా ఉంటాయి అని వ్యాఖ్యానించారు.

అంతే కాదు రాక్షసుల్లా మాట్లాడకండి. నాకు తెలిసిన డాక్టర్ చెప్పిన దాని ప్రకారం ఎటువంటి గుండె సమస్యలు లేకపోయినా, ఎలాంటి సర్జరీలు లేకపోయినా గుండె పోటు వస్తుందని పేర్కొన్నారు. చావుపుట్టుకలు విధి నిర్ణయిస్తుంది. మీరు ఏవేవో ఊహించుకోవద్దు అని ఘాటు స్పందించారు.

Next Story
Share it