‘ప్యాకేజీ’ పేరెత్తటానికి భయపడుతున్న చంద్రబాబు

తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇప్పుడు ‘ప్యాకేజ్’ పేరెత్తటానికి భయపడుతున్నారు. నిన్న మొన్నటివరకూ ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజ్ బెస్ట్ అని..ప్యాకేజీకి చట్టబద్దత కోసం ప్రయత్నిస్తున్నామని స్వయంగా విలేకరుల సమావేశాలు పెట్టి మరీ ప్రకటించిన చంద్రబాబు ఇప్పుడు ‘ప్యాకేజీ’ పేరు ఎత్తటానికి నానా తంటాలు పడుతున్నారు. ఆయన మాట్లాడకుండా ఉండటమే కాదు..పార్టీ నేతలు అందరికీ స్పష్టమైన సంకేతాలు వెళ్ళాయి. అందుకే అందరూ ఇప్పుడు ఒకే పాట పాడుతున్నారు. అదేంటి అంటే ప్రత్యేక హోదాకు సమానమైన ‘సాయం’ అట. ప్యాకేజ్ అంటే ప్రజల్లోకి ప్రతికూల సంకేతాలు వెళుతున్నాయో ఉద్దేశంతో సర్కారు చాలా ఆలశ్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. అందుకే ఇప్పుడు చంద్రబాబు మొదలుకుని టీడీపీ నేతలు అందరూ కేంద్రం తమకు ప్రత్యేక హోదా బదులు అందుకు సమానమైన సాయం చేస్తామని ప్రకటించింది అని..అందుకే దీనికి అంగీకరించారనే కొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చారు. అయితే చంద్రబాబు మొదలుకుని టీడీపీ నేతల వరకూ అందరూ ప్రత్యేక ప్యాకేజీకి సమానమైన ప్రత్యేక సాయం అంటూ ప్రకటిస్తున్నా అత్యంత కీలకమైన ‘పారిశ్రామిక రాయితీల’ విషయంపై మాత్రం అందరూ మౌనం వహిస్తున్నారు.
ప్రత్యేక హోదా వల్ల పెద్దగా ఉపయోగమే ఉండదని..అదేమీ సంజీవిని కాదని చంద్రబాబు చెబుతుంటే...ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు టీ జీ వెంకటేష్ ప్రత్యేక హోదా వస్తే ఏమి వస్తాయో ఓ ఇంటర్వూలో వెల్లడించారు. అదేంటో మీరూ చూడండి. ‘ప్రత్యేక హోదా ఉన్న హిమాచల్ ప్రదేశ్ లో విద్యుత్ ఉచితం, ఎక్సైజ్ ట్యూటీ ఫ్రీ, సేల్స్ ట్యాక్స్ ఫ్రీ, ట్యాక్స్ ఫ్రీ, రవాణా చేసుకునే మెటీరియల్ పై కూడా సబ్సిడీ, అని వెల్లడించారు. ప్రత్యేక ప్యాకేజీ తరహా సాయం అని చెబుతున్నా...ఇందులో ఏదీ ఏపీకి దక్కటం లేదు. అయినా సరే చంద్రబాబు అండ్ కో మాత్రం అన్నీ వస్తున్నాయని..వచ్చేస్తున్నాయని నమ్మించే పనిలో ఉన్నారు. ప్యాకేజీ అంటే అదేదో వ్యక్తిగత సాయం అన్న తరహాలో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళుతున్నాయని గ్రహించి ఆ పదం వాడకంపై ఇప్పుడు నిషేధం విధించారు.
జగన్ కుంభకోణాల టీజర్ వదిలిన నారా లోకేష్
27 May 2022 3:23 PM GMTఅసెంబ్లీ రద్దుకు మేం రెడీ..పార్లమెంట్ రద్దుకు మీరు రెడీనా?
27 May 2022 2:15 PM GMTటాలీవుడ్ కు టిక్కెట్ రేట్ల షాక్
27 May 2022 10:30 AM GMTరాష్ట్రం పరువు తీస్తున్న జగన్
27 May 2022 9:33 AM GMTడ్రగ్స్ కేసులో షారుఖ్ కొడుకు ఆర్యన్ ఖాన్ కు క్లీన్ చిట్
27 May 2022 8:23 AM GMT
జగన్ కుంభకోణాల టీజర్ వదిలిన నారా లోకేష్
27 May 2022 3:23 PM GMTకాంగ్రెస్ అంటేనే అన్ని కులాల కలయిక
26 May 2022 7:15 AM GMTమోడీ తెలంగాణ టూర్..టీఆర్ఎస్ వర్సెస్ బిజెపి
26 May 2022 6:55 AM GMTఇక పార్టీ తోకలు తగిలించుకోదలచుకోలేదు
26 May 2022 5:22 AM GMTమీ వైఫల్యాలను మాపై రుద్దకండి
24 May 2022 2:00 PM GMT