‘ఛల్ మోహన్ రంగా’ ఫస్ట్ సాంగ్ వచ్చేసింది
BY Telugu Gateway24 Feb 2018 10:50 AM IST

X
Telugu Gateway24 Feb 2018 10:50 AM IST
హీరో నితిన్, మేఘా ఆకాష్ జంటగా నటించిన చిత్రం ‘ఛల్ మోహన్ రంగ’. ఈ సినిమాకు సంబంధించి తొలి పాటను చిత్ర యూనిట్ శనివారం నాడు విడుదల చేసింది. ఈ సినిమాను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తుండటం విశేషం. వేసవిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. హీరో హీరోయిన్ల మధ్య వచ్చే సరదా పాటగా రూపొందిన ‘గ..ఘ..మేఘ’ పాటను రిలీజ్ చేశారు. రాహుల్ నంబియార్ ఆలపించిన ఈ గీతానికి కృష్ణకాంత్ సాహిత్యమందించారు. తమన్ సంగీతం అందిస్తున్న సినిమాలో లై ఫేం మేఘా ఆకాష్ హీరోయిన్ గా నటిస్తోంది.
https://www.youtube.com/watch?v=4gDYt1XPkkE
Next Story