తుది దశకు ‘భరత్ అనే నేను’ షూటింగ్
సమ్మర్ సందడికి సూపర్ స్టార్ మహేష్ బాబు రెడీ అవుతున్నారు. ‘భరత్ అనే నేను’ షూటింగ్ తుది దశకు చేరింది. కొరటాల శివ దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా డి. పార్వతి సమర్పణలో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న చిత్రం ఇది. ఈ సినిమాలో బాలీవుడ్ భామ కైరా అద్వాని హీరోయిన్ గా చేస్తున్నారు. పబ్లిక్ మీటింగ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఫైట్ సీన్స్ తో సహా ఈ సినిమా క్లైమాక్స్ షూట్‌ను కంప్లీట్ చేశారు. బ్యాలెన్స్ ఉన్న కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ ఈ నెల 8 వరకు కొనసాగనుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ చిత్రంలో భరత్ పాత్రలో మహేశ్‌బాబు సీఎంగా నటిస్తున్నారు.
ఏప్రిల్‌లో చిత్రాన్ని విడుదల కు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఇతర కీలక పాత్రల్లో ప్రకాశ్‌రాజ్, శరత్‌కుమార్, పోసాని కృష్ణమురళి తదితరులు పోషిస్తున్నారు. మహేష్ బాబుకు ఈ మధ్య కాలంలో బ్రహ్మోత్సవం, స్పైడర్ వంటి డిజాస్టర్ లు వచ్చాయి. దీంతో శ్రీమంతుడు వంటి హిట్ ఇచ్చిన కాంబినేషన్ అయిన కొరటాల శివ, మహేష్ బాబు ల సినిమా కావటంతో భరత్ అనే నేనుపై మహేష్ బాబు అభిమానులు భారీ ఎత్తున ఆశలు పెట్టుకున్నారు.