Top
Telugu Gateway

‘పెట్రోల్ గర్ల్’ గా లో అనుష్క

‘పెట్రోల్ గర్ల్’ గా లో అనుష్క
X

పెట్రోల్ బంకుల్లో అమ్మాయిలు పనిచేయటం ఎప్పటి నుంచో ప్రారంభం అయింది. హైదరాబాద్ లోని పలు బంకుల్లో పనిచేసే యువతులను చూడొచ్చు కూడా. అగ్రరాజ్యం అమెరికా వంటి దేశాల్లో కూడా ఇది చాలా కామన్. ఇప్పుడు మనకు కూడా ఇది చాలా సాదారణ విషయం అయిపోయింది. అయితే ఇప్పుడు స్వీటి అనుష్క కూడా ‘పెట్రోల్ గర్ల్’ అవతారం ఎత్తింది. ఇదేదో సరదా కోసం చెబుతున్నారు అనుకుంటున్నారా? ఏ మాత్రం కాదు. సినిమా షూటింగ్ కోసం కూడా కాదు. మరి అనుష్క ఎందుకు పెట్రోల్ గర్ల్ గా మారింది..అన్నదే కదా మీ సందేహం. ఓ టీవీ షో కోసం అనుష్క ఫిల్మ్ నగర్ రోడ్డు నెంబర్ 1లో ఉన్న పెట్రోల్ బంక్ లో కాసేపు పనిచేశారు.

అక్కడ అభిమానుల నుంచి విరాళాలు స్వీకరించారు. ఈ డబ్బును ఓ ఛానల్ నిర్వహించే ‘మేము సైతం’ కార్యక్రమంలో పాల్గొనే పేదలకు అందజేస్తారు. ఈ టీవీ షోను మంచు లక్ష్మి నిర్వహించే విషయం తెలిసిందే. గతంలోనూ ఇదే తరహాలో టాలీవుడ్ సెలబ్రిటీలు కూరగాయాలు అమ్మటంతో పాటు పలు పనుల్లో పాల్గొని విరాళాలు స్వీకరించారు. అనుష్క పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్న విషయాన్ని మంచు లక్ష్మినే ట్విట్టర్ ద్వారా తెలిపారు. గతంలో ఈ షో కోసం రానా, నాని, నాగచైతన్య, లావణ్య త్రిపాఠి,, రకుల్ ప్రీత్ సింగ్, సమంత, శ్రియ తదితరులు పాల్గొన్నారు. ఇది మేము సైతం సీజన్ 2 కోసం అని చెబుతున్నారు. మరి కొంత మంది త్వరలోనే ఇదే బాట పట్టనున్నారు.

Next Story
Share it