Telugu Gateway
Telangana

మొబైల్ నెంబర్లలో మార్పులేదు

మొబైల్ నెంబర్లలో మార్పులేదు
X

సెల్ ఫోన్ నెంబర్ల మార్పుపై ఒకటే హడావుడి. సామాజిక మాధ్యమాలతోపాటు ప్రధాన పత్రికల ఆన్ లైన్ ఎడిషన్లలోనే అవే కథనాలు. దేశంలో మొబైల్ నెంబర్లు అన్నీ పది అంకెల నుంచి 13 అంకెలకు మారనున్నాయి అని. దీంతో వినియోగదారుల అందరిలో గందరగోళం. ఇన్ని కోట్ల నెంబర్ల మార్పు ఎలా సాధ్యం?. ప్రస్తుత నెంబర్లకు ముందు..లేకపోతే తర్వాత ఏమైనా చేరుస్తారా? అన్న చర్చలు జోరుగా సాగాయి. అసలు పది నెంబర్లే గుర్తుపెట్టుకోవటం కష్టం అయితే 13 నెంబర్లు ఎక్కడ గుర్తుపెట్టుకొంటాం అనే ఆందోళన మరో వైపు. అయితే ఈ ప్రచారాన్ని టెలికం కంపెనీలు అన్నీ కొట్టిపారేశాయి. అయితే 13 అంకెల నెంబర్లు రావటం మాత్రం వాస్తవమే కానీ..అవి మిషన్ టూమిషన్ (ఎంటూఎం) వినియోగదారులకు మాత్రమే అని క్లారిటీ ఇచ్చేశారు.

ఇది సాధారణ ఫోన్ వినియోగదారులపై ఎలాంటి ప్రభావం చూపదని తేల్చారు. ప్రస్తుత పది అంకెల నెంబర్లు ఎప్పటిలాగానే పనిచేస్తాయని కేంద్ర టెలికం శాఖ స్పష్టం చేసింది. అయితే ఎంటూఎం వినియోగదారులకు మాత్రం ఈ ఏడాది జూలై నుంచి 13 అంకెలు గల నెంబర్లు జారీ చేస్తారు. ఇవి ముఖ్యంగా సెన్సర్లు, యంత్రాలు, ఇంటర్నెట్ ఆధారిత ఉపకరణాల నుంచి ఆటోమేషన్ మార్గంలో సమాచారం పొందేందుకు వినియోగిస్తారు.

Next Story
Share it