దేవుడు చాలా మంచివాడు..రాక్షసులకూ వరాలిస్తాడు
BY Telugu Gateway29 Jan 2018 3:50 PM IST

X
Telugu Gateway29 Jan 2018 3:50 PM IST
ఇది ‘గాయత్రి’ సినిమాలో మోహన్ బాబు డైలాగ్. ఈ డైలాగ్ కింగ్ ద్విపాత్రిభినయం చేస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. ఇందులో మోహన్ బాబు డైలాగులు సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. మోహన్ బాబుతో పాటు ఈ సినిమాలో మంచు విష్ణు, శ్రియ, అనసూయలు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ‘రామాయణం ఒక ఆడదాని ఏడుపు వల్ల జరిగింది.
భారతం ఒక ఆడదానికి నవ్వు వల్ల జరిగింది’ అంటూ మోహన్ బాబు చెప్పే డైలాగులు పవర్ ఫుల్ గా ఉన్నాయి. ట్రైలర్ లో మంచు విష్ణు, శ్రియ డైలాగులకు కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. గాయత్రి సినిమాను మోహన్ బాబే లక్ష్మీప్రసన్న బ్యానర్ పై నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
https://www.youtube.com/watch?v=ChGw1S7ypnI
Next Story



