Telugu Gateway
Politics

రజనీకి విశాల్ మద్దతు

రజనీకి విశాల్ మద్దతు
X

తమిళనాడు రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న రజనీకి చిత్ర పరిశ్రమ నుంచి మద్దతు రోజురోజుకు పెరుగుతోంది. నటుడు, దర్శకుడు లారెన్స్ ఇప్పటికే రజనీకి మద్దతు ప్రకటించారు. ఆయన ఏకంగా ఈ పార్టీలో చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే కొత్తగా హీరో విశాల్ కూడా రజనీ పార్టీకి మద్దతు ప్రకటించారు. అంతే కాదు..ఏకంగా రజనీ పార్టీ తరపున 234 నియోజకవర్గాల్లో ప్రచారం కూడా చేస్తానని ప్రకటించారు. రజనీకాంత్‌ కోసం తాను ఓ కార్యకర్తగా పనిచేయటానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. రాజకీయాలంటే సేవ చేయడమేనని విశాల్‌ పేర్కొన్నారు. రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించిన రజనీకాంత్‌ ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు.

విశాల్‌ రజనీ వైపు మొగ్గుచూపుతుండటం తమిళ రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. విశాల్ కు కూడా రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తి ఉన్నట్లు ఈ మధ్యే వెల్లడైంది. ఆర్కే నగర్ ఉప ఎన్నిక బరిలోకి దిగేందుకు విశాల్ ప్రయత్నించి విఫలమైన విషయం తెలిసిందే. ఈ లెక్కన రజనీ పార్టీలో విశాల్ కూడా కీలకపాత్ర పోషించనున్నట్లు అర్థం అవుతోంది.

Next Story
Share it