Telugu Gateway
Telangana

విద్యుత్ అక్రమాలపై చర్చకు రెడీనా...రేవంత్ సవాల్

విద్యుత్ అక్రమాలపై చర్చకు రెడీనా...రేవంత్ సవాల్
X

తెలంగాణ సర్కారుపై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ సర్కార్ విద్యుత్ సరఫరా ముసుగులో కోట్ల రూపాయల అవినీతి కి పాల్పడుతోందని ఆరోపించారు. దివాళా తీసిన కంపెనీలతో ఒప్పందాలు చేసుకుని కమీషన్ల పేరుతో కోట్లు దండుకుంటున్నారని అన్నారు. ప్రభుత్వానీకి దమ్ము ఊంటే కొనుగోలు పై శ్వేత పత్రం విడుదల చెయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ అక్రమాలపై చర్చించటానికి సిద్ధంగా ఉన్నారా? అని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఈ చర్చకు జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు వచ్చినా పర్వాలేదు..ఎవరైనా సరే తాను రెడీగా ఉన్నట్లు పేర్కొన్నారు. కేసీఆర్ సర్కార్ విద్యుత్ సరఫరా ముసుగులో చేసుకున్న ఒప్పందాలలో కోట్ల రుపాయలు అవినీతి జరుగుతుందని...ఆధారాలతో సైతం నిరూపిస్తామని తెలిపారు. మూడున్నర ఏళ్లుగా ప్రభుత్వం ఏ సంస్థల తో విద్యుత్ కొన్నది...ఏ ధరకు కొన్నది...వారికి చెల్లించిన మొత్తం ఎంతో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ కొనుగోళ్లు...సరఫరా పై జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని...విద్యుత్ కొనుగోళ్లపై ప్రభాకర్ రావు తో చర్చకు సిద్ధంగా ఉన్నా తాను ఆధారాలతో వస్తానని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు...ఒక్క సంస్థకే గోల్ మాల్ ఒప్పందా ల తో ప్రభుత్వం 957 కోట్లు చెల్లించింది నిజం కాదా ఆని ప్రశ్నించారు.

కేసీఆర్ అడ్డుగోలు అవినీతి కీ ఆడ్డుపడుతున్నారని ఐఎఎస్ ఆధికారులైన సురేష్ చంద్ర,అరవింద్ కుమార్ లను తప్పించింది నిజం కాదా ఆని ప్రశ్నించారు. ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ ఒప్పందాలన్నీ గోల్ మాల్ ఒప్పందాలుగా ఆభివర్ణించారు. ఏపీ లో అదనపు విద్యుత్ తక్కువ ధరకు ఇస్తామని ఆ ప్రభుత్వం ముందుకు వస్తున్నా....కేసీఆర్ సర్కార్ ఎందుకు కొనడం లేదని రేవంత్ ప్రశ్నించారు...కమిషన్ లు రావనే విభజన చట్టంలో ఉన్నా ఏపీ విద్యుత్ ను కేసీఆర్ ప్రభుత్వం కొనుగోలు చెయడం లేదన్నారు. కాంగ్రెస్ పై ఆభాండాలు వెస్తున్న విద్యుత్ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ముందు తన బతుకేంటో తెలుసుకోవాలని రేవంత్ రెడ్డి సూచించారు..దేశ వ్యాప్తంగా ప్రకటనలు గుప్పించిన సర్కార్ కనీసం నీ పోటో కుడా వేయలేదన్న విషయాన్ని గ్రహించి మంత్రి జగదీశ్వర్ రెడ్డి తన స్థాయి ఆర్ధం చేసుకొవాలని ఎద్దేవా చేశారు.

Next Story
Share it