ఇంటిలిజెంట్ టీజర్ వచ్చేసింది
BY Telugu Gateway27 Jan 2018 12:09 PM GMT
X
Telugu Gateway27 Jan 2018 12:09 PM GMT
సాయి ధరమ్ తేజ్ ను ఈ మధ్య అపజయాలు వెంటాడుతున్నాయి. దీంతో సరైన హిట్ కోసం ఈ మెగా హీరో తపిస్తున్నాడు. ఇప్పుడు కొత్తగా ఇంటెలిజెంట్ అంటూ ముందుకొస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ శనివారం నాడు విడుదల అయింది. ఈ సినిమాలో సాయికి జోడీగా లావణ్య త్రిపాఠి నటిస్తోంది. సికె ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్ పై సి.కళ్యాణ్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఫిబ్రవరి 9న రిలీజ్ కు రెడీ అవుతున్న ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలయ్యాయి.
సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ చేతుల మీదుగా ఈ టీజర్ ను రిలీజ్ చేశారు. సుప్రీం హీరోని తన మార్క్ మాస్ లుక్ లో చూపించాడు వినాయక్. టీజర్ లోనే సినిమా పక్కా మాస్ యాక్షన్ అని కన్ఫామ్ చేశారు. టీజర్ లో ప్రధానంగా ధరమ్ తేజ్ క్యారెక్టర్ ను ప్రజెంట్ చేసేందుకే కేటాయించారు. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ ధర్మాబాయ్ గా నటిస్తున్నాడు. ఇక మీదట పేదోడికి ఫ్లాట్ పాం..ధర్మాబాయ్ డాట్ కామ్ అని టీజర్ లో సాయి చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది.
https://www.youtube.com/watch?v=9TeRpXbUAVU
Next Story