Telugu Gateway
Cinema

‘అదరగొడుతున్న’ రానా

టాలీవుడ్ హీరోల్లో రానాది ప్రత్యేకమైన స్థానం. బాహుబలి అయినా...ఘాజీ అయినా ఆయన కథలు ఎంచుకోవటంలోనే వైవిధ్యం చూపిస్తారు. అది కూడా ఆయనకు కలిసొస్తుంది. రొటీన్ హీరోయిజం ఉండే సినిమాల వైపు ఆకర్షితుడు కాకుండా..కథలో కొత్తదనంలో ఉండేలా చూసుకుంటూ ముందుకు దూసుకెళుతున్నాడు. ప్రస్తుతం అలాంటిదే మరో ప్రాజెక్టు చేపట్టాడు. అదే ‘హథీ మేరీ సాథీ’. ఈ సినిమా త్రిభాషా చిత్రంగా తెరకెక్కనుంది. ఈ సినిమాలో రానా బందేవ్ గా నటించనున్నాడు.

1971లో హిందీలో వచ్చిన బాలీవుడ్ క్లాసిక్ చిత్రం హథీ మేరీ సాథీ స్ఫూర్తిగా ఈ సినిమా తెరకెక్కుతోంది. తెలుగు, తమిళం, హిందీ భాషలలో భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాడు దర్శకుడు సోలొమాన్. ట్రినిటీ పిక్చర్స్ సంస్థ నిర్మించనున్న ఈ సినిమా షూటింగ్‌ 2018 జనవరి నుంచి భారత్, థాయ్ లాండ్ లలో జరగనుంది. దీపావళికి ఈ చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తున్నారు. రానా పుట్టిన రోజు సంద‌ర్భంగా గతంలో ఈ సినిమా టైటిల్ లోగోని వెల్లడించిన చిత్రయూనిట్ తాజాగా కొత్త సంవత్సరం గిఫ్ట్‌ గా ఫ‌స్ట్ లుక్‌ను విడుదల చేశారు.

Next Story
Share it