Telugu Gateway
Cinema

రామ్ చరణ్ కొత్త సినిమా షురూ

రామ్ చరణ్ కొత్త సినిమా షురూ
X

రామ్ చరణ్ స్పీడ్ పెంచాడు. ఓ వైపు నిర్మాతగా బిజీగా ఉంటూనే మరో వైపు హీరోగానూ ప్రాజెక్టులు వరస పెట్టి చేస్తున్నాడు. ఇఫ్పటికే సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న రంగస్థలం సినిమా తుది దశకు చేరుకుంది. ఈ సినిమా సమ్మర్ లో సందడి చేయటానికి రెడీ అవుతోంది. ఇప్పుడు కొత్తగా ఈ మెగా హీరో దర్శకుడు బోయపాటి శ్రీనుతో కలసి తన 12వ సినిమా మొదలుపెట్టేశాడు.

శుక్రవారం హైదరాబాద్ లోని గచ్చిబౌళిలో ఉన్న వనదేవత ఆలయంలో సినిమాను ప్రారంభించారు. ఈ సినిమాలో రామ్ చరణ్ జోడీగా బాలీవుడ్ భామ కైరా అద్వానీ నటిస్తోంది. ఆమె ఇఫ్పటికే మహేష్ బాబు సరసన భరత్ అను నేను సినిమాలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తోంది. రామ్ చరణ్ కొత్త సినిమాకు దేవీశ్రీప్రసాద్ సంగీతం అందించనున్నారు.

Next Story
Share it