యాప్..వెబ్ సైట్ తో ముందుకొచ్చిన రజనీ
రాజకీయాల్లోకి వస్తున్నానని ప్రకటించిన రజనీ అప్పుడు రంగంలోకి దిగారు. అదీ హైటెక్ గా. పార్టీకి విస్తృత ప్రచారం కల్పించటంతోపాటు..అభిమానులకు ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చేందుకు వీలుగా ఓ మొబైల్ యాప్ తో పాటు...వెబ్ సైట్ ను ఆవిష్కరించారు. ఇవి ప్రారంభించి అభిమానులు ఆహ్వానించారు. రజనీమండ్రమ్.కామ్ పేరుతో ఓ వెబ్ సైట్‌ను ప్రారంభించి అందులో రజనీ ప్రసంగం వీడియో పెట్టారు.
తన రాజకీయ ప్రవేశాన్ని స్వాగతించిన అభిమానులను ఆయన ధన్యవాదాలు తెలిపారు. మంచి మార్పు కోసం ఫ్యాన్స్, తమిళ ప్రజలు ఏకతాటిపైకి రావాలని. పార్టీలో వాలంటరీలుగా చేరాలని ఆయన పిలుపునిచ్చారు. రజనీ మండ్రమ్ పేరుతోనే యాప్‌ను కూడా లాంఛ్ చేశారు. రజనీ రాజకీయాల్లోకి రాకను చాలా మంది స్వాగతిస్తున్నారు. ఖచ్చితంగా తమిళనాడు రాజకీయాల్లో రజనీకాంత్ ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.