2.ఓ టీజర్ జనవరి 6న
BY Telugu Gateway4 Jan 2018 2:57 PM IST
Telugu Gateway4 Jan 2018 2:57 PM IST
రజనీకాంత్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 2.ఓ సినిమా టీజర్ విడుదలకు ముహుర్తం కుదిరింది. దాదాపు 450 కోట్ల రూపాయలతో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం ఇది. వాస్తవానికి ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్ ఎప్పుడో మొదలుకావాల్సి ఉన్నా...రకరకాల కారణాలతో ఇది జాప్యం అవుతూ వస్తోంది.
రజనీ, శంకర్‌ల కాంబినేషన్‌లో రూపొందింన రోబో సినిమాకు సీక్వల్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అమీజాక్సన్ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాను ఏప్రిల్ 14న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
Next Story