Telugu Gateway
Cinema

ప్రభాస్ పై అనుష్క సంచలన వ్యాఖ్యలు

ప్రభాస్ పై అనుష్క సంచలన వ్యాఖ్యలు
X

ప్రభాస్..అనుష్క అనగానే అందరూ ఎక్కడికో వెళ్లిపోతారు. వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని అని కూడా ఈ మధ్య వార్తలు గుప్పుమన్నాయి. అలాంటి వార్తలు వచ్చిన సందర్భాలు ఎన్నో. అయితే తాజాగా అనుష్క ప్రభాస్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం భాగమతి సినిమా ప్రమోషన్ పనుల్లో బిజీగా ఉన్న స్వీటీ ఓ మీడియా సంస్థ ప్రతినిధితో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసింది. ప్రభాస్ ను తాను అన్నయ్య అని ఎలా పిలుస్తాను...అందరు అబ్బాయిల్ని అన్నయ్యగా భావించలేం కదా? అని వ్యాఖ్యానించింది. అయితే ప్రభాస్ తనకు ఓ మంచి మిత్రుడు మాత్రమే అని చెబుతోంది ఈ భామ. అనుష్క నటిస్తున్న తాజా చిత్రం భాగమతి. తమిళం, తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అశోక్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

మలయాళ నటులు ఉన్నిముకుందన్, జయరామ్, ఆషాశరత్‌ ముఖ్య పాత్రలను పోషిస్తున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. భాగమతి సస్పెన్స్, థ్రిల్లర్‌ సన్నివేశాలతో కూడిన వైవిధ్యభరిత కథా చిత్రం అని తెలిపారు అనుష్క. ఇందులో తాను సంజన అనే ఐఏఎస్‌ అధికారిణిగా నటించానని చెప్పారు. తాను ప్రస్తుతం పెళ్లి గురించి మర్చిపోయాయని..ఎవరైనా మంచి అబ్బాయిని చూస్తే అప్పుడు ఆలోచిద్దామని తేల్చేశారు. తాను పెద్దగా పేపర్లు చదవనని..అందువల్ల తనపై ఏమి వార్తలు వచ్చినా తనకు తెలియవన్నారు.

Next Story
Share it