నితిన్ కు జోడీగా పూజ
పూజా హెగ్డె టాలీవుడ్ లో వరస పెట్టి ఛాన్స్ లు కొట్టేస్తోంది. నితిన్ కొత్త సినిమాలో ఈ కుర్ర హీరోకు హాట్ హాట్ భామ పూజా హెగ్డె జోడీకట్టనుంది. శ్రీనివాస కళ్యాణంలో వీరిద్దరూ కలసి నటించనున్నట్లు టాలీవుడ్ టాక్... సతీష్ వేగేశ్న ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. తొలుత ఈ సినిమాలోకి హీరోయిన్ గా సాయి పల్లవిని తీసుకోవాలని భావించారని ప్రచారం జరిగింది. కానీ సాయి పల్లవి ఆసక్తి చూపించకపోవటంతో పూజా హెగ్డేను ఫైనల్ చేశారని చెబుతున్నారు.
అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ‘లై’ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిన నితిన్ ప్రస్తుతం కృష్ణచైతన్య దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ కల్యాణ్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు గుర్తుందా శీతాకాలం అనే టైటిల్ ను పరిశీస్తున్నారు. ఈ సినిమాలోనూ నితిన్ సనరస మరోసారి లై ఫేం మేఘా ఆకాష్ నటిస్తోంది.