Telugu Gateway
Cinema

‘అజ్ఞాతవాసి’ సెన్సార్ పూర్తి

కొత్త సంవత్సరంలో విడుదల అవుతున్న భారీ బడ్జెట్ సినిమా అజ్ఞాతవాసి. దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై రోజురోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. అజ్ఞాతవాసి సినిమా సోమవారం నాడు సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యుఏ సర్టిఫికెట్ జారీ చేసింది. జనవరి 10వ తేదీన తెలుగు రాష్ట్రాల్లో.. అంతకు ముందు రోజు అంటే 9వ తేదీన యూఎస్‌లో ‍ప్రీమియర్‌ షోలు ప్రారంభం కానున్నాయి.

ఈ సినిమాలో పవన్‌ సరసన కీర్తి సురేష్‌, అనూ ఇమ్మాన్యూయేల్‌ హీరోయిన్లుగా నటించారు. కుష్బూ, ఆది పినిశెట్టి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మరోవైపు అగ్రహీరో వెంకటేష్‌ కూడా ఓ పాత్రలో కన్పించనున్నట్లు సమాచారం. నూతన సంవత్సరం సందర్బంగా విడుదల చేసిన..పవన్ స్వయంగా పాడిన కొడకా..కోటేశ్వరరావు పాట అభిమానులను ఆకట్టుకుంటుంది.

Next Story
Share it