Telugu Gateway
Politics

దావోస్ లో నారా బ్రాహ్మణి

దావోస్ లో నారా బ్రాహ్మణి
X

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ లే కాదు..నారా బ్రాహ్మణి కూడా దావోస్ సమావేశాల్లో పాల్గొంటున్నారు. ఆమె వీరితో కలిసే దావోస్ పర్యటనకు వెళ్ళారు. అయితే పారిశ్రామికవేత్తల విభాగంలో ఆమె ఈ సమావేశానికి హాజరైనట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దావోస్ అంటే ఛాలు చంద్రబాబుకు ఛాలా ఫ్యాన్సీ. అక్కడ నుంచి వచ్చే పెట్టుబడులు ఏంటి అనే సంగతి పక్కన పెడితే ప్రతి దావోస్ సమావేశానికి ఆయన హాజరవుతారు.

ఈ సారి చంద్రబాబు అక్కరే కాకుండా మంత్రి నారా లోకేష్ ను తీసుకెళ్లారు. తాజాగా వెలుగులోకి వచ్చిన విషయం ఏమిటంటే నారా బ్రాహ్మణి కూడా అక్కడే ఉన్నారు. ఎలాగూ బ్రాహ్మణి పదేళ్ల తర్వాత అయినా రాజకీయాల్లోకి రావటం పక్కా కాబట్టి ముందు నుంచే ఆమెకు కూడా దావోస్ ను పరిచయం చేస్తున్నట్లు ఉన్నారని ఓ అధికారి వ్యాఖ్యానించారు.

https://www.youtube.com/watch?v=-KQU-scdZOU&feature=youtu.be

Next Story
Share it