చేపలకు కన్నీళ్లుంటాయ్.. ఫిబ్రవరి 16న ‘అ!’ విడుదల

హీరో నాని నిర్మాతగా మారి తెరకెక్కిస్తున్న తొలి చిత్రం ‘అ!’. ఈ సినిమా విడుదల ముహుర్తం ఖరారైంది. ఫిబ్రవరి 16న ప్రపంచ వ్యాప్తంగా సినిమా విడుదల కానుంది. ఈ సినిమాకు సంబంధించి థియేట్రికల్ ట్రైలర్ ను చిత్ర యూనిట్ బుధవారం నాడు విడుదల చేసింది. అందులో డైలాగ్ లు అదిరిపోయేలా ఉండటంతో పాటు..పేరు తరహాలోనే ట్రైలర్ కూడా వినూత్నంగా ఉంది. చేపకు వాయిస్ ఇచ్చిన నాని డైలాగు ఆసక్తికరంగా ఉంది. ‘చేపలకు కూడా కన్నీళ్ళుంటాయ్. అవి నీళ్లలో ఉంటాయ్ కదా. కనపడవు అంతే.’ అన్న డైలాగ్ ఈ ట్రైలర్ లో హైలెట్ గా నిలుస్తుంది.
ఇందులో కాజల్, నిత్యామీనన్, రెజీనా కసాండ్రా, మురళీశర్మలు కీలకంగా కన్పిస్తారు. నిజజీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు చెబుతున్నారు. ప్రచార చిత్రాలు...ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. హీరోగా నాని వరస పెట్టి హిట్లు కొడుతూ దూసుకెళుతున్నాడు. మరి నిర్మాతగా మారిన నాని తొలి సినిమాతో ఎలాంటి ఫలితం అందుకుంటారో వేచిచూడాల్సిందే.
https://www.youtube.com/watch?v=xOEscQChX7M
కెసీఆర్ పెద్ద పరీక్షే పెట్టుకున్నారు..అందులో విజయం సాధ్యమా?!
2 July 2022 12:50 PM GMTస్పైస్ జెట్ విమానంలో పొగ..ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరి
2 July 2022 5:36 AM GMTఆవో-దేఖో-సీకో
1 July 2022 3:17 PM GMTనుపుర్ శర్మపై సుప్రీం ఫైర్
1 July 2022 6:58 AM GMTఏపీలో సర్కారు వారి 'సినిమా ఆగింది'
1 July 2022 6:24 AM GMT
ప్రేమలేఖలు అందాయన్న శరద్ పవార్
1 July 2022 6:05 AM GMTఫడ్నవీస్ కు అధిష్టానం షాక్..డిప్యూటీ సీఎం పదవి
30 Jun 2022 2:04 PM GMTవ్యూహాం మార్చిన బిజెపి..శివసేనను పూర్తిగా ఖతం చేసేందుకేనా!
30 Jun 2022 12:27 PM GMTముంబయ్ చేరుకున్న ఏక్ నాథ్ షిండే
30 Jun 2022 9:42 AM GMTసంజయ్ రౌత్ కు ఈడీ నోటీసులు
27 Jun 2022 12:15 PM GMT